కేరళ రాష్ట్రంలో 24 ఏనుగులు అత్యంత బాధ కలిగించే పరిస్థితులలో చనిపోయాయి. గత అయిదు సంవత్సరాల్లో ఇరవై నాలుగు ఏనుగుల మరణించాయని తాజా గణాంకాలలో తేలింది. బుల్లెట్ గాయాల వలన, కరెంట్ షాక్ ల వలన, బాంబుల వలన, వాహనాల ఢీ కొట్టడం వలన ఈ ఇరవై నాలుగు ఏనుగులు చనిపోయాయి. అయితే రోగాల కారణంగా, ఆయుష్షు తీరడం వలన, ఇతర క్రూర జంతువుల దాడి వలన సహజ మరణం పొందిన ఏనుగుల సంఖ్య కూడా చాలా ఎక్కువగా రాష్ట్రంలో నమోదయింది. 2015 వ సంవత్సరం నుండి రాష్ట్రంలో ఏకంగా 416 ఏనుగులు మృత్యువాత పడ్డాయి. అయితే కేవలం ఈ ఏనుగుల మరణాలు దృష్టిలోకి వచ్చినవి మాత్రమే. ఫారెస్ట్ అధికారులు మాట్లాడుతూ దాదాపు ఆరు ఏడు వందల ఏనుగులు వరకు చనిపోయి ఉండొచ్చు అని చెబుతున్నారు. 


కేవలం ఒక్క 2019వ సంవత్సరం లోనే 120 అడవి ఏనుగులు చనిపోగా... వాటిలో 10 మానవుల వలన మరణించాయని కేరళ రాష్ట్ర అటవీ డిపార్ట్మెంట్ తెలిపింది. రాష్ట్రంలో ప్రస్తుతం 5706 ఏనుగులు జీవిస్తున్నాయని సరికొత్త సర్వే లో తేలింది. ఇటీవల పాలక్కాడ్ జిల్లాలోని మార్నార్కాడ్ సమీపంలోని తిరువిజమ్కున్న వద్ద ఒక కాలువలో గర్భిణీ ఏనుగు మరణించిన తరువాత కేరళలోని అడవి ఏనుగుల గురించి భారత దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎవరో మనుషులు కావాలనే పైనాపిల్ లో బాణాసంచా పెట్టగా... దురదృష్టవశాత్తు అది నమిలి తరువాత గర్భిణీలకు తీవ్ర ఆవేదన బాధతో చనిపోయింది. 


2015 వ సంవత్సరం నుండి మనుషుల కార్యకలాపాల వలన 6 ఏనుగుల చనిపోయాయి. జంతువులను కావాలని చంపేందుకు ఏర్పాటుచేసిన కరెంటు తీగ ల వలన 2 ఏనుగు వర్ణించలేని పరిస్థితులలో విలవిలలాడుతూ ప్రాణాలు విడిచాయి. ప్రమాదవశాత్తు కరెంటు తీగలకు 8 ఏనుగులు తాకి మరణించాయి. 2013-14 సంవత్సరాల్లో వేటగాళ్లు పన్నెండు ఏనుగులను తుపాకీలతో కాల్చి చంపారు. ఇప్పటికే 20 కేసులు నమోదు కాగా... 50 మంది మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఇంకా చాలామంది వేటగాళ్ళు పోలీసుల కళ్ళుగప్పి తిరుగుతున్నారు. ఇప్పటికైనా మూగజీవాలను చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చట్టాలు తీసుకురావాలి. అవసరం లేకపోయినా శునకాలను అతి దారుణంగా చంపుతున్నారు కొంతమంది రాక్షసులు. వారిని కూడా జైల్లో వేసి లక్షల రూపాయల్లో జరిమానాలు విధిస్తే బాగుంటుందని జంతు ప్రేమికులు అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: