సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి మనం చూడని ఎన్నో చిత్ర విచిత్రాలు కన్నులకు కట్టినట్టు చూపిస్తున్నారు.  ట్విట్టర్ వేదికగా ప్రకృతిలో జరిగే వింతలు షేర్ చేస్తున్నారు.  ఈ నేపథ్యంలో  కోతి, కింగ్‌ కోబ్రాల పోరుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. సుశాంత నందా అనే ఐఎఫ్‌ఎస్‌ అధికారి తన ట్విటర్‌లో ఈ వీడియో షేర్‌ చేశారు. అంతేకాకుండా ఈ వీడియో చాలా ఉత్కంఠగా ఉందని, శ్వాస కూడా తీసుకోకుండా వీక్షించినట్లు పేర్కొన్నారు. పాము పై కప్ప సవారీ చేయడం చూశాం.. ఇలా ఎదో ఒక చిత్ర విచిత్రమైన వీడియోలు షేర్ చేస్తున్నారు. తాజాగా ఈ వీడియో చూస్తే అంతకంటే షాక్‌ అవ్వక తప్పదు. అసలు కోతి ఎక్కడ, చిరుత ఎక్కడ.  చిరుతని చూస్తేనే గజగజ వణికే వన్యప్రాణి చిరుతని ఎలా వెళ్ళగొట్టిందో మీరే చూడండి.

 

ఈ వీడియోను ఇండియన్‌ ఫారెస్ట్‌ అధికారి సుశాంత నంద ట్విటర్‌లో పోస్ట్ చేశాడు.కోతి, చిరుతకి మధ్య ఎలాంటి వైరం ఉన్నదో ఏమో.. చిరుత కోతిని వెంటాడినట్టుంది. ప్రాణాలు కాపాడుకునేందుకు కోతి వేగంగా చెట్టు ఎక్కేసింది. హమ్మయ్యా బతికిపోయాం అనుకునేలోపే చిరుత కూడా చెట్టు ఎక్కింది. చిరుత కూడా  ఇలా చెట్లు ఎక్కేస్తే ఇంకెలా తప్పించుకుంటారు. కానీ కోతి మాత్రం తప్పించుకుంది. చెట్టు చిటారు కొమ్మకు చేరి గట్టిగా పట్టుకొని గాలికి ఊగుతున్నది.

 

కోతి చలాకీతనమే తన ప్రాణాలు కాపాడింది. ‘బలం, పరిమాణం ఎంత ఉన్నప్పటికీ ప్రకృతి ముందు ఓడిపోవాల్సిందే! ఆకలిగా ఉన్న చిరుత కోతిని చెట్టు మీద నుంచి పడేయడానికి కొమ్మను బాగా ఊపింది. అయినా కోతి కింద పడలేదు. నేను ఇంతకు ముందు పోస్ట్ చేసిన కోబ్రా నుంచి కోతి తనను తాను రక్షించుకోవడం కంటే ఇది బెటర్‌’ అనే క్యాప్షన్‌ జోడించాడు నంద.  ఈ వీడియోను నెజిజన్లు చాలా ఇష్టపడుతు న్నారు. షేర్‌ చేసిన కొన్ని నిమిషాలకే వీడియో వైరల్‌ అయింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: