ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నుండి తెలుగుదేశం పార్టీలో కీలకమైన రాజకీయ కుటుంబంగా పరిటాల కి మంచి పేరుంది. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టుగా పరిటాల ఫ్యామిలీ ఉంది. రాయలసీమ జిల్లాల్లో అత్యధికంగా టీడీపీని ఆదరించిన జిల్లా అనంతపురం. అయితే పరిటాల ఫ్యామిలీ లో పరిటాల రవి చనిపోయిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన పరిటాల సునీత ఎమ్మెల్యేగా గెలిచి చంద్రబాబు క్యాబినెట్ లో మంత్రిగా పని చేయడం జరిగింది. మెల్లగా తర్వాత తన కొడుకు పరిటాల రవి వారసుడు పరిటాల శ్రీరామ్ నీ కూడా రాజకీయాల్లోకి దింపేసింది.

 

గత సార్వత్రిక ఎన్నికలలో మొట్టమొదటిసారి పోటీ చేసిన పరిటాల శ్రీరామ్ ఓడిపోవడం జరిగింది. ఇటువంటి సమయంలో టీడీపీ పార్టీలో కీలకంగా ఉండే పరిటాల ఫ్యామిలీ పార్టీకి అంటీ అంటనట్లు గా వ్యవహరిస్తున్నట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. 2019 ఎన్నికలలో టీడీపీ చిత్తు చిత్తుగా ఓడిపోవడంతో అప్పటినుండి పరిటాల శ్రీరామ్ సొంత వ్యాపారాలు వ్యవహారాలకే పరిమితం అయినట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా పార్టీలో యువతకు పెద్దపీట వేస్తా అని చంద్రబాబు ప్రకటనలు చేస్తున్న ఇప్పటివరకు ఎవరికి కూడా పెద్దగా పదవులు ఇవ్వకపోవటంతో అధినాయకత్వంపై పరిటాల శ్రీరామ్ నిరుత్సాహం చెందినట్లు టాక్.

 

పార్టీలో ముందునుండి ముసలోళ్ళ నాయకత్వం వాళ్ల పెత్తనం పెరిగిపోవడంతో పరిటాల శ్రీరామ్ కూడా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారని జిల్లా రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి. దీంతో పరిటాల వ్యవహరిస్తున్న తీరుపై జిల్లాలో ఉన్న క్యాడర్ మరియు నాయకులకి కూడా డైలమాలో పడిపోయినట్లు రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ పార్టీ పరిస్థితి మరీ దిగజారి పోయినట్లు సమాచారం. స్థానిక ఎన్నికల టైంలో పరిటాల శ్రీరామ్ ఈ విధంగా వ్యవహరించడంతో ఈ విషయం టీడీపీ లో పెద్ద చర్చనీయాంశంగా మారింది. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: