ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వరుసపెట్టి న్యాయస్థానాలలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏడాది పరిపాలనలో దాదాపు 50 కంటే పైగానే మొట్టికాయలు పడటం జరిగింది. ఇటువంటి తరుణంలో జగన్ ఢిల్లీ వెళ్లే కార్యక్రమం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వారంలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా తో అపాయింట్మెంట్ అంతా ఫిక్స్ అయిన తర్వాత జగన్ ఢిల్లీ వెళ్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే మరుసటి రోజే ఢిల్లీ పర్యటన సడన్ గా క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ఇదిలా ఉండగా మరియు త్వరలోనే జగన్ ఢిల్లీ పర్యటన చేపటబోతున్నట్లు  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వ్యవస్థలను మేనేజ్ చేస్తున్న రాజకీయ నేతల గురించి ప్రధాని మోడీతో డిస్కషన్ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

 

డాక్టర్ సుధాకర్ వ్యవహారం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం పలు విషయాలను న్యాయస్థానాలను అడ్డంపెట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆడుతున్న పొలిటికల్ గేమ్ ని ప్రధాని మోడీ దృష్టికి జగన్ తీసుకు వెళ్లనున్నట్లు సమాచారం. అంతేకాకుండా అమలైన జీవోలను న్యాయస్థానాలు కూడా కొట్టివేయడం పట్ల కూడా డిస్కషన్ చేయనున్నట్లు పార్టీ లో టాక్.  రాజ్యాంగంలో కోర్టులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అంతేకాకుండా న్యాయస్థానాలు రాజ్యాంగం అమలు అయ్యే విధానాలను కాపాడాల్సిన బాధ్యత ఉంది.

 

అటువంటిది రాజ్యాంగబద్ధంగా ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాలను అడ్డంపెట్టుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను జగన్ ఎండగట్ట బోతున్నట్లు సమాచారం. మరోపక్క ఇలాంటి పరిణామాలు మోడీ సర్కార్ కి కూడా ఎదురవుతున్నాయి. ప్రజా వ్యాజ్యాలు అంటూ ప్రతిపక్షాలు ఆడుతున్న డ్రామా లను మోడీ సర్కార్ కూడా ఆగ్రహంగా ఉన్నట్లు సమాచారం. ఇటువంటి విషయంపై మోడీతో జగన్ త్వరలో  చర్చలు జరుపనున్నట్లు టాక్. 

మరింత సమాచారం తెలుసుకోండి: