జగన్ అధికారంలోకి వచ్చాక ఇంగ్లీష్ మీడియం మరియు రాజధానులు విషయాలను చాలా కీలకంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పేదవారికి అందుబాటులో ఇంగ్లీష్ మీడియం విద్యా విధానాన్ని తీసుకురావాలని తీసుకున్న నిర్ణయాన్ని కోర్టుల ద్వారా ప్రతిపక్షాలు అడ్డు పడటం జరిగింది. ఈ విషయంలో జగన్ న్యాయస్థానాలలో పోరాడటానికి రెడీ అవ్వుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ విషయం నడుస్తూ ఉండగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి సంబంధించి మూడు రాజధానులు కాన్సెప్టు తెరపైకి తీసుకువచ్చి అభివృద్ధి అంతట జరగాలని జగన్ ఉద్దేశించడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఒకపక్క కోర్టులో కేసులు వేస్తూ ప్రతిపక్షాలు ఆడుతున్న పొలిటికల్ జగన్ కి చెక్ పెట్టే విధంగా జగన్ పెద్ద స్కెచ్ వేసినట్లు ఏపీ రాజకీయాలో వార్తలు వినపడుతున్నాయి.

IHG

అదేమిటంటే వచ్చేనెల తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజు అనగా జూలై 8 వ తారీఖున ఎగ్జిక్యూటివ్ రాజధాని గా విశాఖను ప్రకటించడానికి జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఈ విషయంలో కోర్టులో ఎటువంటి చిక్కులు రాకుండా ముందుగానే ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడానికి జగన్ రెడీ అయినట్లు సమాచారం. అంతేకాకుండా ఇంగ్లీష్ మీడియం విద్యా విధానం విషయంలో ఇప్పటికే పిల్లల తల్లిదండ్రుల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ సేకరించి ఓ నివేదిక తయారు చేసి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టు వెళ్ళటానికి జగన్ రెడీ అయిన విషయం అందరికి తెలిసిందే.

IHG's Abandonment Of Naidu's <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=IDEA' target='_blank' title='idea-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>idea</a> Is ...

ఇదే సమయంలో రాజధాని ప్రజాభిప్రాయ సేకరణ అలాగే ఇంగ్లీష్ మీడియం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి రెండు నివేదికలు దగ్గర పెట్టుకొని ఉంచాలని డిసైడ్ అయ్యారట. జగన్ ఈ రెండు విషయాల్లో కీలక వ్యూహంగా ప్రజాభిప్రాయ సేకరణ తో సరికొత్త రాజకీయ ఎత్తుగడ వేయనున్నట్లు వైసీపీ పార్టీలో సీరియస్ గా డిస్కషన్ లు జరుగుతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: