ఇటీవల వైసీపీ పార్టీపై బహిరంగంగా విమర్శలు చేసిన నరసాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణంరాజు ఓ వెబ్ సైట్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నరు. ఇసుక విషయంలో మరియు మరి కొన్ని విషయాలలో వైసీపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఎండగడుతూ రఘురామకృష్ణంరాజు తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. దీంతో సొంత పార్టీకి చెందిన ఎంపీ వ్యాఖ్యలు చేయడంతో ఎలక్ట్రానిక్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఏర్పడింది. చాలా మంది నెటిజన్లు రఘురామకృష్ణంరాజు చేస్తున్న వ్యాఖ్యలు కరెక్ట్ అని మద్దతు తెలుపుతున్నారు. ఇటువంటి విషయంలో వైసీపీ పార్టీకి సంబంధించిన ఓ వెబ్సైట్ రఘురామకృష్ణంరాజు ని టార్గెట్ చేసి వ్యతిరేకంగా కథనాలు వండి వడ్డించేస్తోంది.

IHG

ఇమేజ్ డామేజ్ చేసే విధంగా కథనాలు రాస్తూ ఉండటంతో రఘురామకృష్ణంరాజు ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. వెబ్ సైట్ క్లోజ్ అయ్యే  విధంగా లోక్ సభలో ప్రివిలేజ్ మోషన్ కి అనుమతి ఇవ్వాలని లోక్సభ స్పీకర్ కి లేఖ రాశారు. దీంతో ఈ విషయం ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అవటంతో ప్రివిలేజ్‌ మోషన్‌ అంటే సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమే అని అంటున్నారు.

IHG

ఇదే తరుణంలో సినిమా ఇండస్ట్రీలో కూడా ఒక ప్రముఖ హీరో ని ఈ వెబ్సైట్ టార్గెట్ గా చేసుకుని కరోనా విరాళాల విషయంలో ఈ వెబ్సైట్ అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ సమయంలో ఆ యువ హీరో ఇదే వెబ్‌సైట్‌పై చర్యల దిశగా ప్రయత్నాలు మొదలు పెట్టడం జరిగింది. కాగన్ తాజా పరిణామంతో అటు రాజకీయ పరంగా గానీ ఇటు సినిమా రంగ పరంగా ఈ వెబ్ సైట్ అందరూ క్లోజ్ చేసే పరిస్థితికి దాపురించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: