కరోనాతో పోరాడుతున్న వారియర్స్‌ను వైరస్ వదలడం లేదు. అన్ని విధాలుగా జాగ్రత్తగా ఉండే డాక్టర్లనే కరోనా అటాక్ చేస్తోంది.  ఇంతకీ ఆస్పత్రుల్లో పని చేసే వాళ్ళు ఎంత వరకు సేఫ్‌గా ఉన్నారు. వైద్యసిబ్బంది కేర్‌కు సంబంధించి తీసుకుంటున్న చర్యలేంటో తెలుసా.. 

 

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగి పోతున్నాయి. ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3 వేలు దాటిపోయింది. ఎంతమంది కరోనా బారిన పడ్డా , ట్రీట్మెంట్ చేసేందుకు డాక్టర్లు ఉన్నారులే అనే ధీమా ఉండేది. అయితే ఇపుడు వైరస్ ఏకంగా వైద్యులనే అటాక్ చేయడం కలవరపెడుతోంది.  ఉస్మానియా, గాంధీ, నిమ్స్, నిలోఫర్ లలో పని చేసే 48 మంది డాక్టర్లుకు వైరస్ సోకడం అందరిని టెన్షన్ పెడుతోంది. వీరే కాకుండా మరికొంతమంది వైద్యసిబ్బందిని వైరస్‌ చుట్టుముట్టింది.  

 

వాస్తవానికి కరోనా ట్రీట్మెంట్ కోసం ప్రభుత్వ ఆస్పత్రులను కోవిడ్, నాన్ కోవిడ్ ఆస్పత్రులుగా  విభజించారు. కోవిడ్ ఆస్పత్రులుగా గాంధీ, ఫీవర్, చెస్ట్ ఆస్పత్రులను ప్రకటించారు. ఇక్కడ పని చేసే వాళ్లకు పూర్తి స్థాయి పిపిఇ కిట్లు ఇచ్చారు. అయితే, నాన్ కోవిడ్ ఆస్పత్రుల్లో పనిచేసేవారికి  పిపిఇ కిట్లు ఇవ్వలేదు.  సర్జికల్ మాస్కులు మాత్రమే ఇచ్చారు. మొదట్లో నాన్ కోవిడ్ ఆస్పత్రులకు పేషేంట్లు  తక్కువగా రాగా.. లాక్ డౌన్ సడలింపుల తర్వాత పెద్ద ఎత్తున బాట పడుతున్నారు. అయితే చాలా మందికి కరోనా ఉన్నా, లక్షణాలు కనబడడం లేదు.  దాంతో డాక్టర్లు కరోనా బారిన పడుతున్నారు.  క్వారంటైన్ పిరియడ్ కూడా డాక్టర్లకు సరిగా ఇవ్వలేదని తెలుస్తోంది. మరోవైపు చాలా మంది మెడికల్ కాలేజీల్లో ఉండటం వల్ల ఒకరి నుంచి మరొకరికి వైరస్ వ్యాప్తి చెందుతోంది.

 

ఒక్క సారిగా ఉస్మానియా, గాంధీ, ఇతర ఆస్పత్రుల్లో వైద్యులకు, వైద్య సిబ్బందికి  కరోనా విజృంభిస్తుండటంతో.... జిహెచ్ఎంసీ పరిధిలోని ఆస్పత్రుల్లో ప్రత్యేక చర్యలకు ఆదేశాలు జారీ చేసింది ప్రభుత్వం. వైద్యులను, సిబ్బందిని రెండు బ్యాచులుగా విభజించి.. ప్రతి బ్యాచ్ కు 7 రోజులు క్వారంటైన్ ఇవ్వాలని  స్పష్టం చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: