ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా తో కష్టాలు పడుతుంది.. మనుషుల ప్రాణాలు మాత్రమే కాదు.. ఆర్థికంగా కూడా కుంగదీస్తుంది.  ఉదయం లేచిన మొదలు పడుకునే వరకు ఎదో ఒక పని చేస్తూ పొట్ట పోసుకునే వారికి కరోనా కష్టాలు తెచ్చిపెట్టింది.  వివిధ దేశాల్లో లాక్ డౌన్ వల్ల ఉపాది కోల్పోయారు.. బతకడమే భారంగా మారిపోయింది. ఈ మద్య కొన్ని దేశాల్లో లాక్ డౌన్ సడలిస్తూ కొన్ని కండీషన్లు పెడుతున్నారు ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో లండన్‌లో ప్రసిద్ధి చెందిన ఎరుపు రంగు టెలిఫోన్‌ బాక్సులు లాక్‌డౌన్‌  తర్వాత కాఫీషాపులుగా మారుతూ కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ కారణంగా టెలిఫోన్‌ బూత్‌ మూతబడింది. సరిగ్గా లాక్‌డౌన్‌ ఎత్తేసే వారంరోజుల ముందు టెలిఫోన్‌ బాక్స్‌లను కాఫీ షాపులుగా మార్చి వ్యాపారం మొదలుపెట్టాలనుకున్నారు దంపతులు లోరినిస్ హెర్నాండెజ్, సీన్ రాఫెర్టీ.  

 

లాక్‌డౌన్‌లో టెలిఫోన్‌ బూత్‌ 6 వారాలుగా మూతబడి ఉంది. ఇలానే కొనసాగితే ఉపాధి పోతుందని ఈ నిర్ణయానికి వచ్చారు దంపతులు. లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా నష్టపోతున్నామని కృంగి పోకుండా తమ తెలివితో మళ్లీ ఉపాది పొందే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనికి అమర్‌ కేఫ్‌గా నామకరణం చేశారు. అయితే ఈ కేఫ్‌లో స్పెషల్‌ కాఫీ అని కొలంబియాకు చెందిన హెర్నాండేజ్‌ చెప్పుకొచ్చాడు. లాక్‌డౌన్‌కు ముందు బాక్సుల తయారీకి అవసరమయ్యే ఖర్చంతా భరించారు. ఇప్పుడు దీనిని కేఫ్‌గా మార్చుకోవడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.

 

అంతేకాదు ఈ బాక్సును ఎక్కడికైనా మార్చుకోవడానికి వీలుగా ఉంటుంది.  దక్షిణ అమెరికా దేశంలో లాక్డౌన్ పరిమితులు భవిష్యత్తులో డెలివరీలను నిరోధించవని రాఫెర్టీ, హెర్నాండెజ్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత దేశంలో కూడా  ఓ ఆటో కార్మికుడు మాత్రం తన తెలివితో అందరిని ఆకర్షిస్తున్నాడు. ఆదాయాన్ని పెంచుకోవడానికి తమిళనాడులోని కోయంబత్తూర్‌కి చెందిన అబ్దుల్‌ సమద్ అనే ఆటోడ్రైవర్‌ వినూత్న ప్రయోగం చేశాడు. తన ఆటో వెనుక భాగంలో చిన్న దుకాణాన్ని పెట్టాడు. అందులో సిగరెట్లు, వాటర్‌ బాటిల్స్‌, బిస్కెట్లను అమ్మడం మొదలు పెట్టాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: