ఈ మధ్య కాలంలో డిజిటల్ కరెన్సీ గురించి ప్రజల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. డాలర్ ను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో చైనా యువాన్ పేరుతో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేస్తోంది. నిజానికి మోదీ అధికారంలోకి వచ్చిన కొత్తలో డిజిటల్ కరెన్సీ దిశగా అడుగులు వేశారు. లక్ష్మీ పేరుతో డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నాలు చేశారు. 
 
డిజిట కరెన్సీలో బ్యాంక్ అకౌంట్ లాగానే అకౌంట్ ఓపెన్ చేసి మనీ డిపాజిట్ చేసి లావాదేవీలను జరపవచ్చు. నగదుతో పనిలేకుండా డిజిటల్ కరెన్సీ ద్వారా లావాదేవీలు జరుగుతాయి. 2014లో లక్ష్మీ పేరుతో భారత్ డిజిటల్ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించిన సమయంలోనే చైనా కూడా యువాన్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రయత్నించింది. చైనా డిజిటల్ కరెన్సీకి సంబంధించిన ప్రక్రియ శరవేగంగా పూర్తి చేసుకొచ్చింది. 
 
చైనా వింటర్ ఒలింపిక్స్ సందర్భంగా ఆ కరెన్సీని మార్కెట్లోకి తీసుకురావాలని ప్రయత్నిస్తోంది. ఒలింపిక్స్ కు వచ్చే సందర్శకులు ఎయిర్ పోర్టులోనే నగదు చెల్లించి డిజిటల్ కరెన్సీకి సంబంధించిన యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుని దానిని ఉపయోగించి లావాదేవీలు జరపాలని సూచించింది. భారత్ లో డిజిటల్ కరెన్సీ ప్రవేశపెట్టాలనుకున్న సమయంలో ఆన్ లైన్ లావాదేవీలు తక్కువగా జరిగేవి. 
 
భారత్ లో భవిష్యత్తులో గూగుల్ పే, ఫోన్ పే బదులుగా లక్ష్మీ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. మోదీ ప్రభుత్వం ప్రస్తుతం ఈ డిజిటల్ కరెన్సీ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇతర దేశాలతో సన్నిహిత సంబంధాలు దెబ్బ తినకుండా ఈ కరెన్సీని అందుబాటులోకి తీసుకురావాలని మోదీ సర్కార్ భావిస్తోంది. అయితే భారత్ లో డిజిటల్ కరెన్సీ అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.                  

మరింత సమాచారం తెలుసుకోండి: