ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. ఏడాది పాలనలో సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో వైసీపీ మంచిపేరు తెచ్చుకుంది. కానీ అదే సమయంలో హైకోర్టులో ఎన్నో కేసుల్లో ఎదురుదెబ్బలు తగిలాయి. అలా ఎదురుదెబ్బలు తగిలిన కేసుల్లో ఇంగ్లీష్ మీడియం కేసు కూడా ఒకటి. ఇంగ్లీష్ మీడియంపై పట్టుదలగా ఉన్న ఏపీ ప్రభుత్వం... హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్‌ వేసింది. 
 
రాష్ట్రంలో 80 శాతానికి పైగా తల్లిదండ్రులు ఇంగ్లీష్ మీడియం కావాలని కోరుకుంటున్నారని... . ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం 1 నుంచి 6 వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు అనుమతి ఇవ్వాలని కోరనుంది. ప్రభుత్వం గతంలో ఇంగ్లీష్ మీడియం కోసం జీవోలు 81, 85లను జారీ చేయగా ఈ జీవోను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ కేసుల మీద విచారణ చేసిన హైకోర్టు ప్రభుత్వం విడుదల చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. 
 
ప్రభుత్వం ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తామని చెప్పటాన్ని టీడీపీ, జనసేన వ్యతిరేకించాయి. హైకోర్టులో జగన్ నిర్ణయానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో సుప్రీం కోర్టులో జగన్ కు అనుకూల తీర్పు వస్తుందా...? అంటే వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలే ఎక్కువని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ సర్కార్ కు ఇప్పటివరకు రెండే రెండు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడ్డాయి. 
 
నిమ్మగడ్డ ఎన్నికలను వాయిదా వేసినా సమయంలో జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించగా సుప్రీం కోర్టు ఎన్నికల కోడ్ ను ఎత్తివేసింది. జర్నలిస్టుల మీద కేసులకు సంబంధించిన అంశంలో హైకోర్టులో తీర్పు అనుకూలంగా వచ్చింది. తెలుగు మీడియంను తొలగిస్తూ ఇంగ్లీష్ మీడియం పెడతామని చెప్పడం వల్లే హైకోర్టుకు గతంలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో జగన్ కు అనుకూలంగా తీర్పు వస్తుందో వ్యతిరేకంగా తీర్పు వస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: