2019 ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వస్తుందని అందరూ భావించారు. రాష్ట్రంలోని 175 సీట్లలో 100 నుంచి 120 సీట్లలో వైసీపీ గెలిచే అవకాశం ఉందని ప్రముఖ సంస్థలు, మీడియా ఛానెళ్లు సర్వేలు చేసి వెల్లడించాయి. కానీ అందరి అంచనాలకు భిన్నంగా రాష్ట్రంలో వైసీపీ 151 ఎమ్మెల్యే స్థానాలలో, 22 ఎంపీ స్థానాలలో ఘనవిజయం సాధించింది. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైంది. 
 
రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రోజు నుండి జగన్ పై పార్టీ నాయకుల నుంచి ఎలాంటి వ్యతిరేకత వ్యక్తం లేదు. కానీ గత కొన్ని రోజుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల నుండి సీఎం జగన్ పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. జగన్ పార్టీ పెట్టి చాలా సంవత్సరాలైంది. ఎన్నో ఎదురుదెబ్బలు తిని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సంక్షేమ పథకాల అమలుపైనే సీఎం ప్రధానంగా దృష్టి పెట్టారు. 
 
ఇదే సమయంలో పార్టీ నాయకులు, నేతలు, కార్యకర్తలకు సంబంధించిన వాటి గురించి అధికార పార్టీలో పట్టించుకునే వారే కరువయ్యారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పారదర్శకంగా పాలన జరుగుతోంది. నేతలు అవినీతి, అక్రమాలకు పాల్పడటానికి ఎలాంటి అవకాశం లేదు. అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే పథకాల అమలు జరుగుతుంది. దీంతో పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆగ్రహానికి లోనే విమర్శలు చేస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
వైసీపీ నేతలు గత కొన్నిరోజుల నుంచి బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఐతే ఈ నేతల సమస్యలపై జగన్ దృష్టి పెట్టటం లేదా ప్రత్యేకంగా వీరికోసం ఒకరిని నియమించటం చేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ పార్టీలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలపై దృష్టి పెట్టి సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నించాల్సి ఉంది. జగన్ ఈ అసంతృప్తి సమస్యను ఎలా పరిష్కరిస్తాడో చూడాల్సి ఉంది. జగన్ పార్టీ నేతల అసంతృప్తిని పట్టించుకోకుండా తప్పు చేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటంతో జగన్ ఎమ్మెల్యేల సమస్యలపై దృష్టి పెట్టాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: