తెలుగుదేశం పార్టీ హయాంలో అమరావతికి ఎంతో ప్రాధాన్యం ఇచ్చారో చెప్పనవసరం లేదు. ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ పెద్దఎత్తున ప్రచారం చేశారు. అమరావతి లో రాజధాని నిర్మాణం పై అప్పట్లో వైసిపి తీవ్రంగా వ్యతిరేకించడం కాకుండా, అనేక ఉద్యమాలు చేపట్టి రైతుల నుంచి బలవంతంగా భూములు సేకరిస్తున్నారని ఉద్యమాలు చేసింది. తెలుగుదేశం ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. అయినా ఎక్కడా వెనక్కి తగ్గకుండా చంద్రబాబు ఐదేళ్ల పరిపాలన కాలంలో అమరావతి పైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. వివిధ దేశాలకు చెందిన నిర్మాణ రంగ నిపుణులతో ప్రతిష్టాత్మక  కంపెనీలతో అమరావతి లో రాజధాని నిర్మాణం అంటూ అప్పట్లో హడావుడి చేసిన సంగతి తెలిసిందే. 

IHG


దీనిపై అప్పటి నుంచి తెలుగుదేశంపై విమర్శలు చేస్తూ వస్తున్న వైసీపీ ఇప్పుడు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అమరావతి నిర్మాణం పై చంద్రబాబును ఉద్దేశించి విమర్శలు చేయడం ఆపలేదు. తాజాగా ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనదైన శైలిలో చంద్రబాబు పై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు హయాంలో గ్రాఫిక్స్ లో రాజధాని, గ్రాఫిక్ లో పేద ప్రజలకు ఇళ్లు కట్టారు అని ఎద్దేవా చేశారు. గత ఐదేళ్లలో మొత్తం అన్నిటిని గ్రాఫిక్స్ లో టీడీపీ ప్రభుత్వం నడిచిందని ఎద్దేవా చేసారు.టీడీపీ హయాంలో కేవలం 6.8 లక్షల ఇళ్లు మాత్రమే కట్టారని వ్యాఖ్యానించారు. పేదలకు కట్టించే ఇళ్ల పై  చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. 


వైఎస్ ప్రభుత్వ హయాంలో 21 లక్షల ఇళ్లు నిర్మించారని, ఐదేళ్లలో 30 లక్షల ఇళ్లు నిర్మించాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏడాదికి 80 వేల కోట్లు అప్పు చేసిందని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేదని రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఆయన అబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా లోకేష్ ను ఉద్దేశించి కూడా బుగ్గన విమర్శలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: