ప్రకృతి వైపరిత్యాలు ఎల్లవేళలా రైతులు, ప్రజలకు కొత్త సమస్యలను సృష్టిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మాత్రం ప్రకృతి వైపరిత్యాల వల్ల మేలు కూడా జరుగుతుంది. అలాంటి ఒక ప్రకృతి వైపరిత్యాన్ని మనం ఇటీవలే ఎదుర్కొన్నాం. ఆఫ్రికా నుంచి పాకిస్తాన్ కు వచ్చిన మిడతలు అక్కడినుంచి భారత్ లోకి ప్రవేశించాయి. ఈ మిడతల వల్ల తెలుగు రాష్ట్రాల ప్రజలు ఇబ్బందులు పడే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి. 
 
అయితే మిడతలు రూట్ మార్చుకోవడం వల్ల తెలుగు రాష్ట్రాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు. అనంతరం వచ్చిన తుఫాన్ వల్ల మనకు ఈ మేలు జరిగింది. ప్రస్తుతం మిడతలు మధ్యప్రదేశ్, జార్ఖండ్ వైపుకు డైవర్ట్ అయ్యాయి. మిడతలు రూట్ మార్చుకోవడానికి తాజాగా నిసర్గ తుఫాను వల్ల వీచిన గాలులే కారణమని నిపుణులు చెబుతున్నారు. మిడతలు గాలివాటం ఎటువైపు ఉంటే అటువైపు వెళతాయి. 
 
ఐతే తుఫాన్ గాలుల వల్ల మిడతలు మధ్యప్రదేశ్, జార్ఖండ్ వైపు మిడతలు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ సర్కార్ రాష్ట్రంలోకి మిడతలు ప్రవేశించకుండా ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. తెలంగాణలో రాష్ట్రంలో పంటల కోతలు పూర్తి కావడంతో మిడతలు వచ్చినా ప్రమాదం ఏమీ ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే తెలంగాణలోకి మిడతలు రాకపోవడంతో ఆంధ్రకు కూడా పెను ప్రమాదమే తప్పింది. 
 
మిడతలు రాష్ట్రంలోకి ప్రవేశించి ఉంటే వాటి గుడ్ల వల్ల పంటలు వేసే సమయంలో కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉండేది. ఆ విధంగా ప్రకృతి వైపరిత్యం కూడా మనకు మేలు చేసింది. నిసర్గ తుఫాను వల్ల మహారాష్ట్ర రాష్ట్రానికి నష్టం చేకూరినా తెలుగు రాష్ట్రాలకు మాత్రం తుఫాను మేలే చేసిందని చెప్పవచ్చు. ప్రకృతి వైపరిత్యాల వల్ల చాలాసార్లు నష్టం జరిగినా నిసర్గ తుఫాను మాత్రం ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు ఎంతో మేలు చేశాయనే చెప్పాలి.    

మరింత సమాచారం తెలుసుకోండి: