తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఇప్పుడు కాస్త సంతోషంగా ఉన్నట్టుగానే కనిపిస్తున్నారు. మొన్నటి వరకు పార్టీ నుంచి బయటకు వెళ్లే నాయకుల హడావుడి  ఎక్కువగా కనిపించడంతో ఆందోళన చెందారు. పార్టీ మారాలనుకునేవారు అందరినీ బుజ్జగించే విధంగా పార్టీ సీనియర్ నాయకులతో రాయబారాలు నడిపించారు. మహానాడులో పార్టీ భవిష్యత్తుపై భరోసా కల్పించే విధంగా చంద్రబాబు మాట్లాడారు. ఎవరూ తొందరపడవద్దని, పార్టీకి మంచి భవిష్యత్ ఉంటుందని, మీ అందరినీ గుర్తుంచుకుంటానని చంద్రబాబు పార్టీ మారాలనుకునే అందరికీ భరోసా ఇచ్చే విధంగా ప్రసంగం చేశారు. ఇప్పటికే పార్టీ మారే ఉద్దేశం ఉన్న నాయకులను, ఎమ్మెల్యేలను గుర్తించి వారితో ప్రత్యేకంగా మాట్లాడేందుకు కొంతమంది నాయకులను పురమాయించారు.

 

IHG


చంద్రబాబు ఎత్తుగడలతో  పార్టీ మారాలనుకునే నాయకుల్లో ఆలోచన కలిగింది. దీంతో తాత్కాలికంగా వలసలకు బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్యెల్యే ఏలూరు సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్, పశ్చిమగోదావరి జిల్లాలో ఒక ఎమ్మెల్యే, విశాఖ జిల్లాకు చెందిన ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు, వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు అంటూ ప్రచారం జరిగినా, వారు తాత్కాలికంగా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి సిద్ధ రాఘవరావు వంటి వారు పార్టీని వీడేందుకు సిద్ధం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగినా అది కాస్తా వాయిదా పడింది.


 ఈనెల 18వ తేదీన రాజ్యసభ ఎన్నికలు ఉండడంతో, ఆ ఎన్నికలు పూర్తయిన తర్వాత వైసీపీలోకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ కూడా జూన్ 18వ తేదీన ఓటింగ్ పాల్గొన్న ఎమ్మెల్యేలు ఎంతమంది ? గైర్హాజరయ్యే వారు ఎంతమంది అనే విషయంలో ఓ క్లారిటీకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఏది ఏమైనా ఇప్పటికిప్పుడు పార్టీ మారాలని భావించిన నాయకులు తాత్కాలికంగా తమ నిర్ణయాన్ని వాయిదా వేసుకునేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. అయితే జూన్ 18 తర్వాత ఏం జరుగుతుందో అనేది తేలాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: