తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అమరావతి మా శ్వాస, ధ్యాస అంటూ గట్టిగానే మాట్లాడారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అంటూ గట్టిగానే ప్రచారం చేసుకున్నారు. దానికి అనుగుణంగానే రాజధానిలో భూములు సేకరించి, అక్కడ ఆ దేశాలకు ధీటుగా రాజధాని నగరాన్ని నిర్మించాలని చంద్రబాబు ప్లాన్ చేశారు. కానీ టిడిపి పరిపాలన కాలంలో అమరావతి నిర్మాణాన్ని చంద్రబాబు పూర్తి చేయలేకపోయారు. ఇక ఏపీలో అధికారం చేపట్టిన వైసిపి పూర్తిగా అమరావతి అమాశాన్ని పక్కనపెట్టి విశాఖ ను రాజధానిగా చేయాలని నిర్ణయించడం, మూడు రాజధానుల పేరుతో అమరావతిని పక్కన పెట్టడం వంటివి జరిగాయి. ఈ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మార్చుకుని తెలుగుదేశం పార్టీ మళ్లీ అమరావతి రైతుల ఉద్యమం పేరుతో, ఆ ప్రాంతంలో దీక్షలు కూడా చేపట్టారు.

IHG


 ఆ దీక్షలు ప్రారంభం అయ్యి 150 రోజులు దాటేసింది. ఆ సమయంలో ఆ వ్యవహారాన్ని ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. టిడిపి అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ నాయకులంతా ఈ విషయాన్ని పక్కన పెట్టేసారు. విశాఖ రాజధాని అని టిడిపి నాయకులు కూడా ఫిక్స్ అయిపోయారు. మరో వైపు చూస్తే వైసీపీ విశాఖలో రాజధాని ఏర్పాటు పనుల్లో పూర్తిగా నిమగ్నమైంది. చకచకా పనులు అన్నీ పక్కన పెట్టేస్తున్నారు. ఇక అక్కడే రాజధాని ఫిక్స్ అంటూ వైసిపి నాయకులు చెప్పేస్తున్నారు.


 కానీ చంద్రబాబు మాత్రం అమరావతి వ్యవహారాన్ని గట్టిగా హైలెట్ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోని తన సొంత నివాసంలో ఉంటున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలు అన్నిటిని జూమ్ యాప్ ద్వారా మాత్రమే నిర్వహించాలని, అవసరమైతే తప్ప ఏపీకి వెళ్ళ కూడదని ఆయన నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అమరావతి మరుగునపడిన అంశంగానే టీడీపీ దృష్టిలో కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: