యూ-టర్న్...గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఎక్కువగా వినిపించిన మాట. చంద్రబాబు చెప్పిన మాట మీద నిలబడకుండా, అనేక సార్లు మాట తప్పడంతో అప్పుడు ప్రతిపక్షంలో వైసీపీ...బాబు యూ టర్న్ తీసుకున్నారని విమర్శలు చేసింది. అయితే ఆ యూ టర్న్ మాట జనాల్లోకి ఎంత బాగా వెళ్ళిందో కూడా తెలుసు. అందుకే జనం యూ టర్న్ బాబుని పక్కనబెట్టి జగన్‌ని గెలిపించుకున్నారు.

 

సరే ఇప్పుడు జగన్ సీఎం పీఠం మీద కూర్చుంటే ప్రతిపక్షంలో ఉన్న 40 ఇయర్స్ ఇండస్ట్రీ అయిన చంద్రబాబు మెదలకుండా ఉంటారు. జగన్ అధికార పీఠం ఎక్కిన దగ్గర నుంచి వరుస పెట్టి విమర్శలు, ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కూడా జగన్ ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా అయితే బాబు మరింత రెచ్చిపోతూ...విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏడాది కాలంగా రద్దులు, జె-టర్న్ లు తప్ప మీరు చేసిందేంటి? బాబు ప్రశ్నించారు.

 

సన్న బియ్యంపై, కాళేశ్వరంపై, 45 ఏళ్లకే పింఛన్ పై, ఉద్యోగుల సిపిఎస్ పై, కరెంట్ చార్జీలపై, రైతులకు రూ 3 వేల కోట్ల స్థిరీకరణ నిధిపై, యువత ఉపాధిపై.. ఇలా అన్నింటిలోనూ మీరు తీసుకున్న జె-టర్న్‌లతో రాష్ట్రం కూడా రివర్స్‌లో తిరోగమనం పట్టిందని,  ప్రత్యేక హోదా నుంచి అమరావతి వరకు మీరెన్ని చెప్పారు? ఇప్పుడు చేస్తున్నది ఏంటి? సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపించారు.

 

అయితే జే టర్న్ అని చెప్పి జగన్‌ని హైలైట్ చేసి, ప్రజల్లో నెగిటివ్ చేయాలనే ఉద్దేశంతో బాబు తెగ ప్రయత్నిస్తున్నారని, కానీ అవేమీ వర్కౌట్ కావని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. బాబు అసలు అధికారం ఎక్కిన దగ్గర నుంచి యూ టర్న్‌లే కదా అంటూ మండిపడుతున్నాయి. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ప్రత్యేక హోదా, బాబు వస్తే జాబు, ఇంటికో ఉద్యోగం, అమరావతి నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధి పేరుతో గ్రాఫిక్స్, నకిలీ పెట్టుబడులు ఇలా చెప్పుకుంటూ పోతే బాబు చాలానే యూ టర్న్‌లు తీసుకున్నారని అంటున్నారు. ఈ యూ టర్న్ బాగా హైలైట్ అయ్యి జనం బాబుని ఓడించారని, కానీ బాబు జే టర్న్‌ని హైలైట్ చేసి అబద్దాలు చెబుతూ జనంలో జగన్‌ని నెగిటివ్ చేయడం సాధ్యమయ్యే పని కాదని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: