టీడీపీ అధినేత చంద్రబాబు ఈ మధ్య నీతులు బాగా ఎక్కువ చెబుతున్నట్లు కనబడుతోంది. తన హయాంలో జరిగిన తప్పులని సరిదిద్దుకోకుండా..ప్రతిపక్షంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్ పాలనపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. మధ్య మధ్యలో ఆయనకు సూట్ కాని డైలాగులు వేస్తున్నారు. ఇటీవల జగన్ పాలన ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా చంద్రబాబు...వరుస పెట్టి విమర్శలు చేయడం మొదలుపెట్టారు.

 

సోషల్ మీడియా వేదికగా ఏదొక పోస్టు పెడుతూ...జగన్‌పై ఫైర్ అవుతున్నారు. తాజాగా కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. సమాజాన్నీ ప్రభావితంచేసే రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమని, ప్రజల్లో ఒక నమ్మకం, భరోసా కలిగాక ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని నిలబెట్టుకోవాలని, లేదంటే చరిత్రహీనులమవుతామని నాలుగు డైలాగులు వదిలారు. అంటే ఆయన జగన్ పాలన గురించి ఈ వ్యాఖ్యలు చేశారు.

 

బాబు మాటలు బట్టి చూస్తే జగన్ చెప్పిన మాట నిలబెట్టుకోవడం లేదని పరోక్షంగా విమర్శ చేశారు. అయితే వాస్తవానికి జనం నమ్మకం కోల్పోయిన రాజకీయ నేత ఎవరని అడిగితే అందరూ ఠక్కున చంద్రబాబు పేరే చెబుతారు. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత అనుభవం ఉంది కదా అని ఏపీ ప్రజలు చంద్రబాబుని సీఎం చేశారు. అయితే జనం నమ్మి గెలిపిస్తే బాబు మాత్రం..ఐదేళ్లలో ప్రజలకు చుక్కలు చూపించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అని చెప్పి ప్రజల చెవులో పువ్వులు పెట్టారు. అభివృద్ధి పేరిట పెద్ద గ్రాఫిక్స్ చేసి చూపించారు. చెప్పిన సమయానికి ఒక్క పథకం అమలు చేయలేదు.

 

పైగా టీడీపీ నేతల దోపిడి, అవినీతి ఎక్కువైపోయింది. ఫలితంగా జనం చంద్రబాబు మీద నమ్మకం కోల్పోయి జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారు. తొలిసారి సీఎం అయిన జగన్ ఒక ఏడాదిలోనే తాను ఇచ్చిన హామీలని 90 శాతం అమలు చేశారు. చెప్పిన సమయానికి పథకం అమలు చేశారు. కాబట్టి జనం ఇంకా జగన్ మీద నమ్మకం కోల్పోలేదు. కానీ ఇప్పటికీ బాబు ప్రజల విశ్వాసం పొందలేదు. ఏదేమైనా జనం జగన్‌ని వదలడం కష్టమే.

మరింత సమాచారం తెలుసుకోండి: