ఏంటో ఈ మధ్య మాత్రం బాలయ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హాట్ టాపిక్ అవుతున్నారు. ఇటీవలే షూటింగ్‌ల విషయంలో తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపిన చిరంజీవి అండ్ బ్యాచ్‌పై బాలయ్య ఫుల్ ఫైర్ అయ్యారు. తనని ఎవరు పిలిచారని ప్రశ్నిస్తూ...వాళ్ళందరూ భూములు పంచుకోవడానికి వెళ్ళారా? అంటూ పెద్ద సంచలనమే సృష్టించారు.

 

అయితే బాలయ్య మాటలపై నాగబాబుతో పాటు ఓ ఇద్దరు ముగ్గురు సినీ పరిశ్రమకు సంబంధించిన వారు కాస్త ఘాటుగా స్పందించారు. కానీ మిగతా సినీ పరిశ్రమ వాళ్ళంతా బాలయ్యకే మద్ధతు తెలిపారు. ప్రస్తుతానికి ఈ ఇష్యూ అలా అలా సాగుతుండగా, బాలయ్య గురించి ఇంకో మేటర్ తెరపైకి వచ్చింది. ఇటీవల మహానాడు కార్యక్రమంలో బాలయ్య మాట్లాడుతూ...ఈ వైసీపీ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, త్వరలోనే ఈ అరాచక పాలన అంతం కానుందని నాలుగు డైలాగులు వదిలారు.

 

ఇక బాలయ్య మాట్లాడిన మాటలపై వైసీపీ పెద్దగా స్పందించలేదు. బాలయ్యకు పెద్ద రాజకీయాలు తెలియవనో లేక ఆయన ఏదో సినిమా మాదిరిగా డైలాగులు చెప్పారు అనుకున్నారేమో తెలియదు గానీ వైసీపీ నేతలు మాత్రం ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోలేదు. కానీ తాజాగా మాత్రం రైల్వేకోడూరు వైసీపీ ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు మాత్రం సడన్‌గా వచ్చి బాలయ్యపై విమర్శలు చేశారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదని గతంలో డాక్టర్లు చెప్పారని, ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని తెలిపారు.

 

బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనర్హుడని, ఆయన వ్యవహార శైలితో హిందూపురం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును బాలకృష్ణ భుజాన మోస్తున్నారని విమర్శలు చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు రివర్స్ అయినట్లు కనిపిస్తున్నాయి. బాలయ్య అభిమానులు టీడీపీలోనే కాకుండా, వైసీపీలో కూడా ఉన్నారు. దీంతో వైసీపీ ఎమ్మెల్యే చేసిన విమర్శలపై వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

బాలయ్యతో ఇబ్బందులు ఉంటే హిందూపురం ప్రజలు రెండోసారి ఇంకా మంచి మెజారిటీతో గెలిపించుకునేవారు కాదని సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. ఇక బాలయ్య మానసిక పరిస్తితి సరిగా లేదని వ్యాఖ్యానించడం దారుణమని, బాబు..ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచారని ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నారని, కానీ ఆయన్ని 1999,2014లలో ప్రజలే మోశారని గుర్తుచేస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: