మారుతున్న కాలం కొన్నింటిని   కాలగర్భంలో కలిపేస్తూ  ఉంటుంది అన్న విషయం తెలిసిందే . అయితే దీనిని జీవన ప్రమాణాల్లో తేడా అని అంటుంటారు కొందరు. జీవన ప్రమాణాల్లో  తేడా మాత్రమే కాదు ప్రజల అభిరుచుల్లో  ఏర్పడిన తేడా అని కూడా అంటున్నారు. ఒకప్పుడు కార్లు బైకులు ఉండేవి కాదు కేవలం సైకిల పైన మాత్రమే ఎక్కడికి వెళ్లాలన్నా వెళ్లేవారు కానీ ప్రస్తుత జనరేషన్ లో మాత్రం కేవలం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సరదా తీర్చుకోవడానికి మాత్రమే సైకిల్ తొక్కడానికి ఇష్టపడుతున్నారు. కేవలం ఒక వ్యాయామంగా మాత్రమే మారిపోయింది సైకిలింగ్.  దీని ఎఫెక్ట్  అట్లాస్ కంపెనీ పై  పడినట్లు తెలుస్తోంది. 

 

 అట్లాస్ సైకిల్ తయారీ కంపెనీ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన విషయం తెలిసిందే. సైకిల్ వాడకం ఎక్కువగా ఉన్న సమయంలో అట్లాస్ కంపెనీ టాప్  ప్లేస్లో దూసుకుపోయింది. కాని ప్రస్తుతం సైకిల్ వాడకం తగ్గిపోవడంతో అట్లాస్ కంపెనీ ఏకంగా మూతపడాల్సి దుస్థితి వచ్చింది. అంతకుముందు వరకూ మాన్యుఫాక్చరింగ్ క్రమ క్రమంగా తగ్గించుకుంటూ వచ్చిన... కంపెనీ ఇప్పుడు ఏకంగా సంస్థ మూసివేసిన దుస్థితి ఏర్పడింది. ఉత్తరప్రదేశ్లో ఉన్న అట్లాస్ కంపెనీ కి సంబంధించినటువంటి ప్రధాన విభాగాన్ని కూడా మూసివేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది. 

 


 ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అట్లాస్ యూనిట్లను మూసి వేయగా చివరగా ఉత్తరప్రదేశ్లోని సాహిత బాద్ లో ఉన్న చివరి యూనిట్ కూడా మూసివేస్తున్నట్లు ప్రకటించింది యాజమాన్యం. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కంపెనీని మూసివేయక  తప్పడం లేదు అంటూ తెలిపింది . కాగా  ఏడు వందల మంది ఉద్యోగులు నిరుద్యోగులను  చేసే నిర్ణయం ఇదే. ఇలా ఒకప్పుడు ఎంతగానో ప్రజాదరణ పొందిన అట్లాస్ కంపెనీ ప్రస్తుతం మూసివేసే స్థితికి రావడం మారుతున్న కాలానికి అనుగుణంగా జరిగింది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: