ప్రపంచవ్యాప్తంగా కరోనా తాకిడి రోజు రోజుకి పెరుగుతోందే కానీ ఎక్కడా తగిన ఆనవాళ్ళు అయితే లేవు. ఒక్క చైనా మాత్రం అనూహ్యంగా దాని బారి నుండి బయట పడింది కానీ మిగతా దేశాలన్నీ ఇప్పటికీ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇప్పుడు ఒక్కసారిగా కేసులు అమాంతం పెరిగి పోవడంతో అటు ప్రభుత్వాలకు మరియు ఆరోగ్య నిపుణులు ఏమి చేయాలో తెలియడం లేదు.

 

అయితే ప్రజలు మాత్రం మునుపటిలా పెద్దగా కంగారు పడటం లేదు. ఇంకా గట్టిగా చెప్పాలంటే జనానికి ఒక రకంగా కరోనా అలవాటు అయిపోయింది. మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పినట్లు కరోనా తో కలిసి జీవించడం ఇకపై అందరూ నేర్చుకోవాలేమో. ఇక పోతున్న ప్రాణాలు మరియు ఆసుపత్రి బారిన పడుతున్న మనుషులను పక్కన పెడితే దాని ప్రభావంతో అన్ని వ్యవస్థలు కుదేలవుతున్నాయి. ఆర్థిక నష్టం భారీగా ఉంది. జనాలు ఉపాధి కోల్పోయి రోడ్డున పడుతున్నారు.

 

 

ఎప్పుడు వీటన్నింటికీ ఒకటే పరిష్కారం వ్యాక్సిన్ తయారీ అన్నది ప్రజలందరి మాట. అయితే కరోనాకు వ్యాక్సిన్ వచ్చేందుకు కనీసం సంవత్సరం రోజులు పడుతుంది అన్నది అందరికీ తెలిసిన నిజం. ఏడాది అయితే కనీసం ఆశలు కూడా పెట్టుకోవద్దని ఇప్పటికే నిపుణులు తేల్చి చెప్పేశారు. అయితే కొన్ని రకాల మందులు కరోనా కు బాగానే పనిచేస్తుండడంతో వైరస్ ప్రభావాన్ని డాక్టర్లు కొంతమేరకు తగ్గిస్తున్నారు. అయితే మందులన్నీ అలోపతీవే ఇంకా వీటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువే.

 

కానీ అయుర్వేదంలో ఇప్పుడు కరోనాకు ప్రభావవంతమైన మందును కనుగొంది దాల్మియా హెల్త్ కేర్ సంస్థ. పాలీహెర్బల్ కాంబినేషన్ ఔషధం సామర్థ్యం భద్రతను అంచనా వేయడానికి క్లినికల్ పరీక్షలు ప్రారంభించినట్లు సంస్థ తెలిపింది. కరోనా పేషెంట్లకు సహాయపడే అత్యంత సమర్థ ఆయుర్వేదిక్ సమ్మేళనం ఇదని సంస్థ అంటోంది. ఔషధాన్ని ఇప్పటికే చెన్నైలోని ప్రత్యేక ప్రభుత్వ ఆస్పత్రిలో కరోనా రోగులపై పరీక్షించి అధ్యయనం చేశారు. ఎలాంటి దుష్ప్రభావాలు లేకుండా కరోనా చికిత్సకు ఔషధం తోడ్పడిందని అధ్యయనంలో తేలినట్లు సంస్థ పేర్కొంది. ఇది కరోనా చికిత్సలో మంచి ముందడుగుగా భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: