ఏపీని కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా రికార్డు స్థాయిలో 9,831 శాంపిల్స్‌ను పరీక్షించగా 50 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 84మందికి.. విదేశాల నుంచి వచ్చిన మరో నలుగురికి కరోనా నిర్థారణ అయ్యింది

 

తాజాగా గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇద్దరు కరోనా వైరస్ బారిన పడి మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 73కు చేరుకుంది. కృష్ణా జిల్లాలోనే తాజాగా రెండు మరణాలు సంభవించాయి. కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకున్న 21 మందిని శుక్రవారం ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.

 

కొత్తగా నమోదైన కేసులతో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 4,250కి చేరుకున్నాయి. ప్రస్తుతం 1060 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారురాష్ట్రంలో ఇప్పటి వరకు 2294 మంది కరోనా వైరస్ వ్యాధి నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జీ అయ్యారు.

 

ఇకపోతే మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో శుక్రవారం కొత్తగా 143 కరోనా  పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3290కి చేరింది. తాజా కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 116, రంగారెడ్డిలో 8, మహబూబ్‌నగర్‌ 5, వరంగల్‌ 3, ఆదిలాబాద్‌, మేడ్చల్‌, ఖమ్మం, సంగారెడ్డి, కరీంనగర్‌, మంచిర్యాల జిల్లాలో 2 చొప్పున కేసులు నమోదయ్యాయి

 

ఇక వైరస్ ప్రభావానికి ఒక్క రోజులో 8మంది చనిపోయారు. రాష్ట్రంలో కరోనాతో  రికార్డు స్థాయిలో ఇంత ఎక్కువ మంది చనిపోవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య 113కు చేరిందిరాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 3వేల 290కు చేరింది. ఇందులో.. 15వందల యాభై మంది హాస్పిటళ్లలో చికిత్స పొందుతుండగా… 16వందల 27 మంది డిశ్చార్జ్ అయ్యారు. జీహెచ్ఎంసీ పరిధిలోనే శుక్రవారం 116 కేసులు నమోదయ్యాయి.

 

ఇలా ఆంధ్రలో కరోనా భీభత్సానికి వైరస్ సోకిన వారి అన్నీ కాంటాక్ట్ లకు పరోక్షలు నిర్వహించగా.... ఎక్కువ టెస్టుల రికార్డు నెలకొనగా..  తెలంగాణలో చాలా విచారకరంగా ఎక్కువ మరణాల రికార్డు నెలకొనబడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: