కోవిడ్ 19.. ప్రస్తుత పరిస్దితుల్లో ఇండియాలో గట్టిగానే తిష్టవేసి కూర్చుందట.. పరాయిదేశం పంచిన ఈ వైరస్ మూలంగా ఇప్పటికే భారత దేశంలోని పేద, మధ్యతరగతి జీవులు ఆర్ధికంగా అష్టకష్టాలు పడుతున్నారట.. అసలే వర్షాకాలం సమీపించడానికి ముందే ఇక్కడ రోజురోజుకూ కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కాగా ఇదివరకు ప్రపంచంలోనే కరోనాతో తీవ్రంగా ప్రభావితమైన దేశాల్లో ఇటలీ ఒకటి అన్న విషయం తెలిసిందే.. కానీ ఆ రికార్డ్‌ను మనం దాటే పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఇది కేసులు నమోదు విషయంలో మాత్రమే..

 

 

ఇక శుక్రవారం నాటికి ఇటలీలో 2.34 లక్షల కేసులు ఉండగా, మన దేశంలో 2.26 లక్షలు దాటాయి. దీంతో కరోనా కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్‌ ఆరో స్థానానికి దగ్గరగా ఉంది. త్వరగానే ఈ సంఖ్యను దాటవేస్తుంది అని అనుకుంటున్నారట.. ఇక మనదేశంలో తాజాగా 24 గంటల్లో 9,851 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందట.. మరోవైపు 24 గంటల్లో మునుపెన్నడూ లేనంతగా 273 మంది కన్నుమూశారు. ఇక మరో విషయం ఏంటంటే.. భారత్ ఇన్నాళ్లూ రోజువారీగా ఎక్కువ కేసులు నమోదవుతున్న దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉండగా, ‌తాజాగా రష్యాను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరుకుంది.

 

 

ఇండియాలో దాదాపుగా అన్ని సంస్దలకు అనుమతులు లభించడం, మరో రెండు రోజుల్లో నగరంలో బస్సులు తిప్పాలనే నిర్ణయంలో ప్రభుత్వం ఉండటం కొంత ఆందోళనకు దారితీస్తుంది.. ఒక రకంగా మనదేశ ప్రభుత్వాలు ఎవరి ఆరోగ్య రక్షణ బాధ్యతలను వారికే అప్పచెప్పింది.. కానీ కరోనా అంటే ఏదో ఒక చిన్న విషయంగా భావించి జనాలు విచ్చల విడిగా సోషల్ డిస్టెన్స్ పాటించకుండా కరోనాకు ముందు ఉన్న పరిస్దితుల్లో ఎలా ఉన్నారో ఇప్పుడు అలా ఉంటున్నారు.. ఈ పరిస్దితులు ఇలాగే కొనసాగితే ఈ సంవత్సరం చివరిలో కరోనా కేసుల విషయంలో మనదేశం మొదటి స్దానానికి వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: