కరోనా వల్ల పరాయి దేశాల్లో చిక్కుకున్న మన తెలుగు వారి బాధలు వర్ణాతీతం. ఇప్పటికే మన కేంద్రప్రభుత్వం ఈ విషయంలో విదేశాల్లో చిక్కుకున్న వారిని కొందరిని ఇండియాకు ‘వందే భారత్‌’ మిషన్‌లో భాగంగా తీసుకువచ్చారు.. అలాగే వేరే దేశం వారిని కూడా సురక్షితంగా వారి వారి దేశాలకు పంపారు.. అయినా కానీ మన భారదేశ ప్రజలు ఒక చోట అని లేరు.. ప్రపంచం మొత్తం వ్యాపించి ఉన్నారు.. ఇక ఇందులో కొందరు విద్యార్ధులు కూడా ఉన్నత చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.. అయితే ఈ కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చాల మంది వారున్న చోటనే చిక్కుకున్నారు.

 

 

అందులో కిర్గిస్థాన్‌ రాజధాని బిష్కెక్‌లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన దాదాపు 1200 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. వీరందరు బిష్కెక్‌లోని భారత రాయబార కార్యాలయానికి ‘వందే భారత్‌’ మిషన్‌లో భాగంగా తమను భారత్‌ పంపాలంటూ మెయిల్స్‌, ఫోన్ల ద్వారా విన్నవించారు. అయినా గానీ అక్కడి అధికారులు స్పందించకపోగా.. విద్యార్థులకు అవకాశం లేదంటూనే కొందరిని మాత్రమే ఇండియాకు తరలించారట.. దీంతో తమను కూడా ఇక్కడి నుండి భారత్ పంపాలని విన్నవించుకోవడానికి విద్యార్థులంతా మూకుమ్మడిగా శుక్రవారం భారత ఎంబసీకి చేరుకొని అధికారులకు తమ పరిస్థితిని వివరించగా, వారు స్పందించక పోగా, నిర్లక్ష్యంగా ఓ అధికారి మేమేం చేయలేం, ప్రధాని మోదీకే చెప్పుకోండి అంటూ సమాధానం ఇవ్వడంతో విద్యార్థులు వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

 

వారిలో కొందరు విద్యార్థులు ఎంబసీ అధికారుల తీరును సెల్‌ఫోన్‌లో చిత్రీకరిస్తుండగా, వారి ఫోన్లను లాక్కునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఎంబసీ కార్యాలయంలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుందట.. ఇక ఇక్కడ తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, అసలు ఉండలేక పోతున్నామని తమను స్వదేశానికి రప్పించే విషయంలో త్వరగా స్పందించాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు భారత ప్రధానిని విద్యార్థులు కోరుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: