ప్రపంచంలో చైనా నుంచి పుట్టుకు వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వినాశనం చేస్తున్నట్లే  ఉంది.  ప్రతిరోజూ వేల సంఖ్యలో పెరిగిపోతున్న కేసులు చూస్తే అసలు భూమిపై ఇంతటి ఘోరాన్ని ఎలా ఆపగలం అన్న అనుమానాలు వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ కరోనాకి వ్యాక్సిన్ కనుగొనలేక పోయారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 68లక్షల 44వేల 797 మంది ఈ వైరస్‌ భారిన పడ్డారు. వీటిలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 30లక్షల 97వేల 791గా ఉంది. కోవిడ్‌-19 కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3లక్షల 98 వేల 146 మంది మరణించారు. వ్యాధి నుంచి 33లక్షల 48వేల 860 మంది కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు.  అత్యధిక కరోనా కేసులతో అమెరికా మొదటి స్థానంలో కొనసాగుతోంది. అక్కడ 19,24,051 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 1,10,173 మంది చనిపోయారు. కొద్ది రోజులుగా అమెరికాలో కేసుల సంఖ్య తగ్గుతూ వస్తోంది.

 

 

ఇక  బ్రెజిల్ లో 6,15,870 పాజిటివ్ కేసులు నమోదవ్వగా 34,039  మంది చనిపోయారు. రష్యాలో 4,41,108కేసులు నమోదవ్వగా 5384 మంది చనిపోయారు. మిగతా దేశాలతో పోలిస్తే రష్యాలో మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. స్పెయిన్ లో కరోనా కేసులు 2లక్షల 87వేలు దాటాయి. 27వేల మంది చనిపోయారు.  అగ్రరాజ్య అమెరికా కరోనా మహమ్మారి ప్రభావానికి తీవ్రంగా గురైతుంది. యూఎస్‌ఏలో ఇప్పటివరకు ఒక లక్షా 11వేల 390 మంది చనిపోయారు. ప్రపంచంలో చావులు ఎన్ని ఉన్నాయో మూడో వంతు అమెరికాలోనే జరిగాయి. 

 

 

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌-19 కారణంగా అత్యధిక మరణాలు సంభవించిన దేశాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. బ్రెజిల్‌-35,047, రష్యా-5,528, స్పెయిన్‌-27,134, యూకే-40,261, ఇటలీ-33,774, పెరూ-5,162, జర్మనీ-8,763, టర్కీ-4,648, ఇరాన్‌-8,134, ఫ్రాన్స్‌-29,111, చిలీ-1,448, మెక్సికో-13,170, కెనడా-7,703, పాకిస్థాన్‌-1,838, చైనా-4,634, బెల్జియం-9,566, నెదర్లాండ్స్‌-6,005, స్వీడన్‌-4,639, ఈక్వెడార్‌-3,534, కొలంబియా-1,145, పోర్చుగల్‌-1,465, ఈజిప్టు-1,166, స్విర్జర్లాండ్‌-1,921, ఇండోనేషియా-1,770, పోలాండ్‌-1,137, ఐర్లాండ్‌-1,670, రొమేనియాలో 1,316 మంది వ్యాధి కారణంగా చనిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: