ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వైరస్ తో నానా తంటాలు పడుతుంటే.. మరోవైపు ఉగ్రవాదులు తమ పని తాము చేసుకుంటూ పోతున్నారు.  విధ్వంసాలు సృష్టించడం.. ఆత్మాహుతి దాడులు, ఊచకోతంలు ఇలా ఒక్కటి కాదు ఎన్నో దారుణాలకు పాల్పపడుతున్నారు.  గత కొన్ని రోజులుగా భారత్ లో జమ్మూకాశ్మీర్ లో ఉగ్రమూకలు ఏ విధంగా రెచ్చిపోతున్నారో తెలిసిందే.  తాజాగా  ఉత్త‌ర ఆఫ్రికాకు చెందిన ఆల్ ఖ‌యిదా నేత అబ్దెల్‌మాలిక్ డ్రౌక‌డెల్‌ను హ‌త‌మార్చిన‌ట్లు ఫ్రాన్స్ ప్ర‌క‌టించింది. మాలే దేశంలో జ‌రిగిన ఆప‌రేష‌న్‌లో ఆ ఉగ్ర‌వాదిని హ‌త‌మార్చారు. మే నెల‌లో మాలేలోనే జ‌రిగిన మ‌రో ఆప‌రేష‌న్‌లో ఇస్లామిక్ స్టేట్ గ్రూపు క‌మాండ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఫ్రాన్స్ చేప‌డుతున్న డేరింగ్ ఆప‌రేష‌న్స్‌తో ఉగ్ర‌వాద గ్రూపుల‌కు భారీ జ‌ల‌క్ త‌గిలిన‌ట్లు భావిస్తున్నారు.

 

డ్రౌక‌డెల్‌తో పాటు అత‌ని స‌భ్యులు కొంద‌రు హ‌త‌మైన‌ట్లు ఫ్రాన్స్ ర‌క్ష‌ణ‌శాఖ మంత్రి ఫ్లోరెన్స్ పార్లే తెలిపారు. భాగ‌స్వామ్య బృందాల‌తో ఉగ్ర‌వాద వేట‌ను కొన‌సాగించ‌నున్న‌ట్లు ఫ్రాన్స్ ప్ర‌క‌టించింది.   ఇక  అబ్దెల్‌మాలిక్‌ గ‌తంలో ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న సోవియేట్ ద‌ళాల‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేశాడు. ఇరాక్‌లోనూ ఆల్‌ఖ‌యిదా నేత‌గా కొన‌సాగాడు. ఓ మ‌ర్డ‌ర్ కేసులో అబ్దెల్‌కు 2012లో అల్జీరియా కోర్టు ఉర‌శిక్ష‌ను ఖ‌రారు చేసింది.

 

2007లో అత‌నూ అల్జీర్స్‌లో బాంబు పేలుళ్ల‌ల‌కు పాల్ప‌డ్డాడు.  పేలుడు ప‌దార్ధాల త‌యారీలో డ్రౌక‌డెల్ నిష్ణాతుడు. ద‌శాబ్ధ కాలం నుంచి అబ్దెల్‌ను ప‌ట్టుకునేందుకు ఫ్రాన్స్ భారీ ఆప‌రేష‌న్ చేప‌ట్టింది.   ఇలా ఎన్నో నేరాలు ఘోరాలు చేస్తూ.. అల్జీరియా జిహాదీగా పేరుగాంచిన అబ్దెల్‌.. స‌హారా ప్రాంతంలో అత్యంత క్రూర‌మైన ఆల్‌ఖ‌యిదా నేత‌గా ఎదిగాడు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: