ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీ పాఠ‌శాల వ్య‌వ‌స్థ‌లో కీల‌క మార్పులు కీలక మార్పులు చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్ లో విద్యాసంస్థలు తీసుకోవాల్సిన చర్యలపై పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే మార్గదర్శకాలను విడుదల చేసింది. విద్యాశాఖ తరగతి గదిలో 30 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉంటే విద్యార్థులను రెండు బ్యాచులుగా విభజించి విద్యాబోధ‌న చేయాల‌ని ఆదేశించింది. 
 
రాష్ట్రంలో సాధారణ పరిస్థితులు ఏర్పడే వరకు మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థుల‌కు సరుకులను పంపిణీ చేయాల్ని సూచించింది. పాఠశాల ఆవరణను క్రిమిసంహారాల‌తో శానిటైజ్ చేయాలని.... స్కూల్ ఎంట్రన్స్ దగ్గర విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతలను పరిశీలించాలని.... ఉపాధ్యాయులు, విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని ఆదేశించింది. చేతులు కడిగే యంత్రాలను ఏర్పాటు చేయాలని... సబ్బులు, శానిటైజర్లను స్కూలు యాజ‌మాన్యం అందుబాటులో ఉంచాలని సూచించింది. 
 
తాగునీరు, మధ్యాహ్న భోజనానికి విడతకు 10 మందిని మాత్రమే అనుమతించాలని సూచించింది. మార్నింగ్ ప్రేయర్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటన వెలువడింది. తరగతి గదిలో 50 - 100 మంది విద్యార్థులు ఉంటే రోజు విడిచి రోజు క్లాసెస్ నిర్వహించాలని పేర్కొంది. ప్రతిరోజూ 15 నిమిషాల పాటు కరోనా నిర్వహణ చర్యలను వివరించాలని ఆదేశించింది. వ్యక్తిగత వ్యాయామాలు, యోగా నేర్పించవచ్చని... గేమ్స్ పీరియడ్‌ను రద్దు చేయాలని సూచించింది. 
 
‘నో స్కూల్‌ బ్యాగ్‌ డే’ ను తప్పనిసరిగా నిర్వహించాలని..... పిల్లల్లో ఒత్తిడి తగ్గించేందుకు మూవీస్ లాంటివి చూపించాలని ఆదేశించింది. పరీక్షల నిర్వ‌హ‌ణ స‌మ‌యంలో పరీక్ష కేంద్రాల దగ్గర విద్యార్థుల శరీర ఉష్ణోగ్రతను పరిశీలించాలని.... కంటోన్మెంట్, క‌ట్ట‌డి ప్రాంతం నుంచి వచ్చే స్టూడెంట్స్ కు కలెక్టర్లు రవాణా సదుపాయం కల్పించాలని ఆదేశించింది. ఒక్కో గదిలో 10 మందిని మాత్రమే ఎగ్జామ్ కు అనుమతించాలని పేర్కొంది.       

మరింత సమాచారం తెలుసుకోండి: