కొద్దిరోజులుగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇద్దరు అగ్ర హీరోల మధ్య నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారడం, దానిపై ఇద్దరు అగ్ర హీరోలు కు చెందిన మద్దతుదారులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం ఇలా పెద్ద రచ్చ జరిగింది. ఈ విషయంలో టాలీవుడ్ రెండుగా చీలిపోయింది అనే అభిప్రాయం అందరిలోనూ ఏర్పడింది. ఈ విషయంలో బాలయ్య చిరంజీవి కూడా అభాసుపాలు అవుతుండడం, ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ ఏకతాటిపై నడిచిందనే అభిప్రాయం ఉన్నా, ఈ సంఘటనతో ఇండస్ట్రీలో అగ్ర హీరోల మధ్య లుకలుకలు ఉన్నాయనే విషయం బయటపడింది. అయితే ఈ విషయంలో చిరంజీవి కాస్త తెలివిగా వ్యవహరించి ఈ వివాదానికి పులి స్టాప్ పెట్టేందుకు సిద్ధమయ్యారు. 

 

IHG


దానిలో భాగంగానే, ఈనెల 9వ తేదీన ఏపీ సీఎం జగన్ ను కలిసేందుకు చిరంజీవి బృందానికి అపాయింట్మెంట్ దొరకడంతో వారంతా జగన్ ను కలిసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక తమతో బాలయ్యను కూడా తీసుకెళ్తామని నిర్ణయించుకుని, ఈ మేరకు ఆయనకు కబురు పంపగా, ఆయన నో చెప్పారట. దీనికి కారణం 10వ తేదీన బాలయ్య పుట్టినరోజు ఉండడంతో, ఆ వేడుకలు కారణంగా తను ఆ సమావేశానికి హాజరు కాలేను అంటూ బాలకృష్ణ కబురు పంపినట్లు తెలుస్తోంది. అలాగే తమ రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న జగన్ ను కలవడం ద్వారా పార్టీలో రకరకాల వాదనలు బయలుదేరుతాయని గ్రహించిన బాలయ్య జగన్ తో భేటీకి ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. 


అయితే ఈ విషయాన్ని నేరుగా చెప్పకుండా, తన పుట్టిన రోజును సాకుగా చూపించినట్టు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో నడుస్తున్న చర్చ. ఈ విషయంలో చిరంజీవి మాత్రం బాగానే తప్పించుకున్నట్లు కనిపిస్తున్నారు. ఎలాగూ జగన్ దగ్గరకు బాలయ్య రారు అనే విషయం తెలిసే ఆయనకు కబురు పంపడం ద్వారా, తమ తప్పేమీ లేదని నిరూపించుకునే ప్రయత్నం చిరంజీవి చేసినట్టుగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: