వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా వచ్చాక పాలన ఓ వైపు సాగుతూండగానే మరో వైపు వివాదాలూ పెరిగిపోతున్నాయి. ఒక్కోటిగా జతచేరుతూండడం ఇబ్బందిగా ఉంది. ఈ నేపధ్యంల్లో జగన్ వీటిపైన ద్రుష్టిపెడుతూనే పాలనను కూడా చక్కబెట్టాల్సివస్తోంది. అయినా చాలా అపరిష్క్రుతంగా సమస్యలు ఉంటూనే ఉన్నాయి.

 

అటువంటి వాటిలో శాసనమండలి ఒకటి. సాసనమండలిని జగన్ సార్కార్ రద్దు చేస్తూ తీర్మానం ఆమోదించింది. అయితే ఈ తీర్మానం ఇపుడు కేంద్రం వద్ద పెండింగులో ఉంది. జగన్ ఇదే విషయం కదపడానికి ఈ మధ్య ఢిల్లీ వెళ్దామనుకున్నారు. కానీ అమిత్ షాతో మీటింగ్ హఠాత్తుగా క్యాన్సిల్ అయింది. 

 

ఈ నేపధ్యంలో పార్లమెంట్ లో ఎపుడు ఈ తీర్మానం వస్తుందో ఆమోదం పొందుతుందో అన్నది కూడా పెద్ద ప్రశ్నగా ఉంది. ఈ క్రమంలో ఏపీ అసెంబ్లీ సమావేశాలు తోసుకువస్తున్నాయి. మార్చిలో నిర్వహించాల్సిన సమావేశాలు కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డాయి. ఈ నెలాఖరు వరకే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఆమోదానికి గవర్నర్ అనుమతి తీసుకున్నారు. దాంతో పూర్తి స్థాయి బడ్జెట్ ని సభకు సమర్పించి ఆమోదం తీసుకోవాలి. దాంతో ఈ నెల 19 నుంచి అసెంబ్లీ సమావేశాలు అంటున్నారు.

 


పది రోజుల పాటు  అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని వైసీపీ సర్కార్ అనుకుంటోంది. అయితే శాసనమండలి రద్దు కాలేదు. దాంతో గవర్నర్ తో ఉభయ సభల్లో మాట్లాడించాల్సిఉంటుంది.  మరి జగన్ దీనికి అంగీకరిస్తారా అన్న చర్చ సాగుతోంది. శాసనమండలి సమావేశాలు జరిగితే అది పెద్ద తలనొప్పి అది అధికార పక్షం భావిస్తోంది. ప్రతీ బిల్లు అక్కడకు వెళ్లి వస్తుంది.

 

అక్కడ తెలుగుదేశానికి మెజారిటీ ఉన్నందువల్ల వారు తన బలంతో తిప్పికొడుతూంటారు. దాంతో వైసీపీ సర్కార్ అనుకున్న విధంగా చట్టాలు చేయడానికి అవకాశం ఉండకుండా బ్రేకులు పడుతూంటాయి.  దీంతో ఏం చేయాలన్న దాని మీద వైసీపీ పెద్దలు సమాలోచనలు జరుపుతున్నారని అంటున్నారు. ఏది ఏమైనా అసెంబ్లీని సమావేశపరిస్తే ఇప్పటికైతే ఉనికిలో ఉన్న శాసన‌ మండలిని కూడా సమావేశం జరిపితీరాల్సిందేనని రాజ్యాంగ నిపుణులు అంటున్నారు. మరి చూడాలి 

 

మరింత సమాచారం తెలుసుకోండి: