మన దేశంలో ధనవంతులు, పేదవాళ్ల కంటే మధ్యతరగతి వాళ్లే ఎక్కువ. సాధారణంగా పేదలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహాయసహకారాలు అందిస్తాయి. ధనవంతులకు భారీగా ఆస్తులు ఉంటాయి కాబట్టి వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. మధ్యతరగతి వాళ్లు అటు సంక్షేమ పథకాలకు నోచుకోలేక భారీ ఆస్తులు లేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వీరి విషయంలో కొంత నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తాయి. 
 
ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మనుషుల్లో పేద, మధ్య తరగతి, ధనవంతులు ఎలా ఉంటారో ఆస్పత్రుల్లో కూడా ప్రభుత్వ, ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులు ఉంటాయి. దేశంలో మధ్య తరగతి వాళ్ల పరిస్థితి ఎలా ఉందో ప్రైవేట్ ఆస్పత్రుల పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ప్రజలు కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లాలంటే ఆస్తులు అమ్మేయాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే అక్కడ డాక్టర్లు అందుబాటులో ఉండరని... మందులు అందుబాటులో ఉండవనే విమర్శలు సాధారణ ప్రజల నుంచి వ్యక్తమవుతూ ఉంటాయి. 
 
ప్రైవేట్ ఆస్పత్రులు తక్కువ ఖర్చులతో ఆస్పత్రులను రన్ చేస్తూ ఈ.ఎం.ఐలు, సిబ్బందికి జీతాలు చెల్లిస్తూ, రోగుల నుంచి కూడా తక్కువ మొత్తంలోనే ఫీజులను వసూలు చేస్తూ ఉంటాయి. రాష్ట్రంలో పలుచోట్ల కార్పొరేట్ ఆస్పత్రులు సీరియస్ కేసులను చేర్చుకుని వారి నుంచే డబ్బులు వసూలు చేస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వం కరోనా విజృంభణ వల్ల కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులను మాత్రం స్వాధీనం చేసుకుంది. 
 
ప్రైవేట్ ఆస్పత్రులకు మాత్రం ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదాయం లేదు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు సిబ్బందికి జీతాలు చెల్లించడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాయి. ఆస్పత్రి యాజమాన్యం జీతాలు చెల్లించకపోవడంతో సిబ్బంది పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. జీతాలు లేక ఇబ్బందులు పడుతూ వీరు నరకయాతన అనుభవిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా వారి బాధలను చెప్పుకుంటున్నారు. జగన్ సర్కార్ వీరిపై దృష్టి పెట్టి వీరికి తగిన న్యాయం చేయాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: