కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనూ ఆలయాలు తెరిచేందుకు రంగం సిద్ధమైంది. భక్తులు సామాజిక దూరం పాటిస్తూ, స్వామి దర్శనం చేసుకునేందుకు ఆలయాల్లో ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే అంతరాలయాల్లో మాత్రం భక్తులకు అనుమతి ఉండదు.

 

సోమవారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో గుడి గంటలు మోగనున్నాయి. ఈ నెల 8, 9 తేదీల్లో దేవాలయాల ఉద్యోగులు, స్థానికులతో ట్రయల్‌ రన్ నిర్వహిస్తామని,పదో తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భక్తులకు దర్శనానికి అవకాశం ఇస్తామన్నారు ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.దేవాలయాలకు వచ్చే భక్తులు...క్యూలైన్ ద్వారా కచ్చితంగా ఆరడుగుల భౌతికదూరం పాటించాలని సూచించారు. మాస్కులు ఉన్నవారినే ఆలయాల్లోకి అనుమతిస్తామని, ప్రవేశ ద్వారం వద్దే భక్తులకు థర్మల్ స్కానింగ్, హ్యాండ్ స్యానిటైజర్ అందుబాటులో ఉంచామన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఉన్న దేవాలయాల్లోకి భక్తులను అనుమతించబోమన్నారు. భక్తులందరూ కచ్చితంగా ఆరోగ్య సేతు యాప్ ఫోన్ లో కచ్చితంగా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలన్నారు.

 

దేవాలయాలన్నింటినీ శానిటైజ్ చేయడంతోపాటు ఆహ్లాదకరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలంగాణదేవాదాయ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. దేవాలయాల్లో ప్రసాదం, శఠగోపం ఉండదన్నారు. భక్తులు నియంత్రణ పాటిస్తూ.. ఇష్టదైవాన్ని దర్శించుకోవచ్చన్నారు.

 

విజయవాడ ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ.. సోమవారం నుంచి భక్తులకు దర్శనమివ్వనుంది. భక్తుల రాక సందర్భంగా.. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కేంద్రం గైడ్ లైన్స్ పాటిస్తూ..భక్తులను దర్శనానికి అనుమతించనున్నారు.

 

శ్రీశైలంలో బ్రమరాంబికా మల్లికార్జునస్వామి దర్శనానికి ... దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి దర్శన సమయంలో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. 

 

కాణిపాకంలో రెండురోజుల పాటు ట్రయల్ రన్ నిర్వహిస్తున్నారు. గంటకు 3 వందల మందికి మాత్రమే స్వామి దర్శనానికి అనుమతించనున్నారు.గర్భాలయ దర్శనం నిలిపివేయడంతోమూషిక మండపం వరకే భక్తులకు అనుమతిస్తున్నారు.ఆలయం వెలుపల ప్రసాదాలు విక్రయిస్తారు.

 

మహానంది ఆలయ ఈవో మల్లికార్జున ప్రసాద్... దేవాలయంలో సిబ్బందితో కలిసి ట్రైల్ రన్ నిర్వహించారు. మహానందీశ్వరుడి దర్శనానికి వచ్చే భక్తులు కేవలం లఘు దర్శనం మాత్రమే చేసుకోని వెళ్లాలని, గర్భాలయ దర్శనం నిషేధమన్నారు.రుద్ర గుండం కొనేరుల్లో స్నానాలు రద్దు చేశామని ...భక్తులకు శఠగోపం, అభిషేకాలు, తీర్థ ప్రసాదాలు కూడా రద్దు చేసినట్టు తెలిపారు. 

 

యాదగిరి గుట్టలో శ్రీలక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయం..ఎనిమిదో తేదీ నుంచి తెరచుకోనుంది. ఇప్పటికే ఈదిశగా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

 

సోమవారం నుండి వేములవాడ రాజన్న ఆలయంలో భక్తులకు దర్శనం లభించనుంది. భక్తుల రాక సందర్భంగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు..భక్తుల క్యూ లైన్ లను శుద్ధి చేసి ఆలయానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆలయ అధికారుల సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: