దేశంలో కొంతమంది ఐడియాజిస్టులు  వారు చెప్పిందే వేదంగా భావిస్తూ ఉంటారు. పక్కవాడు  ఏమనుకుంటున్నాడు అసలు వాస్తవం ఏమిటి అనేదానికంటే వాళ్లకు ఏదనిపిస్తే  అదే నిజం గా భావిస్తూ దానిని ప్రచారం చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా కామెంట్లు కూడా చేస్తూ ఉంటారు. ఇలాంటి ఐడియాలజిస్టులు తాజాగా కేరళలో ఏనుగు మరణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశార. గర్భవతిగా ఉన్న ఏనుగు నోట్లో  బాంబులు పెట్టడం  కారణంగా అది పేలి ఏనుగు  దారుణంగా మరణించిన విషయం తెలిసిందే. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం గా మారిపోయింది దీనిపై ఎంతో మంది తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ మనుషుల్లో మానవత్వం కరువైంది అంటూ... సేవ్ అనిమల్ అనే నినాదాన్ని కూడా వినిపిస్తున్నారు. 

 


అయితే ఏనుగు మృతి పై దేశం మొత్తం స్పందిస్తుంటే ఒక జంతువు మృతి పై ఇంత రచ్చ చేస్తారా అంటూ విమర్శలు చేసింది వీళ్ళే. ఇక తాజాగా వీళ్ళే మళ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జామియా ఇస్లామియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి స్టూడెంట్ నాపురా జర్గర్  కి నిన్న ఢిల్లీ హై కోర్టు బెయిల్ నిరాకరించింది. ఆమె  గర్భవతి కాబట్టి ఆమెకు బెయిల్ ఇవ్వండి అంటూ ఆమె తరపు న్యాయవాది కోర్టులో వాదించగా  కోర్టు తోసిపుచ్చింది. ఈమె సీఏ వ్యతిరేక నిరసనలు పేరిట మత విద్వేషాలను రెచ్చగొట్టడం లో కీలక పాత్ర పోషించింది కాబట్టే ఆమెకు బెయిల్ ఇచ్చే అవకాశం లేదు అంటూ కోర్టు తెలిపింది. 

 


 దీనిపై కొంత మంది రంగంలోకి దిగి ఏనుగు చనిపోతే స్పందించిన సమాజం ఒక మహిళ గర్భం తో జైల్లో ఉంటే స్పందించరా అంటూ.. ప్రశ్నించారు. ఒక ఏనుగు మీద ఉన్న ప్రేమ జాలి ఒక మహిళ మీద ఉండదా  అంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై విశ్లేషకులు ఏమంటున్నారంటే ఏనుగుకి  దారుణంగా నోట్లో బాంబులు పెట్టి చంపేశారు కానీ ఇక్కడ గర్భవతిగా ఉన్న మహిళ మాత్రం  చంపిన వాళ్లకి తోడు ఉంది. అయితే ఈ మహిళలకు జైల్లో  ఎలాంటి ప్రాణాపాయం లేదు. అయితే అటు చనిపోయిన ఏనుగు తో  ఇటు గర్భంతో ఉన్న మహిళ ను పోల్చడం కరెక్టేనా  అంటూ ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: