ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా  వైరస్ విజృంభిస్తూ  ఎంతోమంది ప్రాణాలను బలి తీసుకున్న విషయం తెలిసిందే. అయితే కరోనా  వైరస్ వెలుగులోకి వచ్చినప్పుడే అన్ని దేశాలతో సహా భారతదేశంలో కూడా లాక్ డౌన్ అమలు  అయిన విషయం తెలిసిందే. ఇక ఆ తర్వాత విడతలవారీగా లాగ్ పొడిగిస్తూ వచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఇక నాలుగో విడత లాక్ డౌన్  నుంచి కేంద్ర ప్రభుత్వం పలు సడలింపు ఇస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం ఐదో విడత లాక్ డౌన్  దేశ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఇది అమలులో ఉంది అనడం కంటే అన్ లాక్ చేసేసారు అనడమే బెటరేమో. అయితే లాక్ డౌన్ మళ్ళీ విదిస్తే  దేశం ఆర్థికంగా కుదించడంతో పాటు చాలా మంది సామాన్యుల జీవితాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితి ఏర్పడుతుంది.. అంతేకాకుండా సైకలాజికల్ కూడా ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది. 

 


 ఈ నేపథ్యంలో మళ్లీ దేశంలో సంపూర్ణంగా లాక్ డౌన్  అయితే అమలు చేసే అవకాశం లేదు అంటున్నారు విశ్లేషకులు. ఎందుకంటే మళ్లీ లాక్ డౌన్ విధిస్తే పూట గడవని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది అని అంటున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఏకంగా పది వేల వరకు కరోనా కేసులు ప్రతి రోజు నమోదు అవుతున్న  విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఉంటూ వైద్యుల సూచన మేరకు ఈ మహమ్మారి వైరస్ నుంచి బయట పడవచ్చు అన్నటువంటిది  ప్రస్తుతం అధికారులు చెబుతున్నారు. లక్షణాలు తీవ్రమైతే వైద్యుని సలహా తీసుకోవాలి. చిన్నపిల్లలు వృద్దులను పేషంట్ నుండి  దూరంగా ఉంచాలి. 

 


 కరోనా  వైరస్ ఉన్నట్లు అనుమానాలు ఉన్నప్పటికీ ఒకవేళ నిర్ధారణ అయినప్పటికీ ఎలాంటి ఆందోళన చెందవద్దని వైద్యుల సూచనలు పాటించాలని అంటున్నారు.  ఏదైనా అత్యవసరమైతే టోల్ ఫ్రీ నెంబర్ 994455 కి కాల్ చేసి సలహాలు తీసుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్యవంతులైన వారే పేషెంట్కు సహాయకులుగా ఉండాలి. అంతేకాకుండా 50 ఏళ్లు పైబడిన వారు పేషెంట్ కు దూరంగా ఉండాలి. బాధితుల కోలుకునే వరకు వృద్దులు చిన్న పిల్లలను  వేరే వేరే చోట పంపించడం మేలు. ఇక వైద్యుడు సూచించిన మేరకు హైడ్రోక్లోరిక్ మాత్రలు తీసుకోవాలి. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కింది వీడియోలో....

మరింత సమాచారం తెలుసుకోండి: