కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ  సోషల్ మీడియా వేదికగా కొన్నిసార్లు చేసే పోస్ట్ లు చర్చనీయాంశం గా మారిపోతూ ఉంటాయి అనే విషయం తెలుస్తుంది. ఆయన దేని గురించి చెప్పాలనుకుని దేని గురించి చెబుతున్నారు అన్నది మాత్రం ఎవరికీ అర్థం కాదు. రాహుల్ గాంధీ పెట్టే పోస్ట్ లు  దాదాపు ఇలాంటివే ఉంటాయి. అందుకే సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతుంటాయి. ఆయన ఇచ్చే స్టేట్ మెంట్లు  చిత్రవిచిత్రంగా ఉంటాయి. మొన్నటికి మొన్న కరోనా  వైరస్ కి సంబంధించి కొన్ని లెక్కలు చెప్పగా  అది చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. ప్రపంచమంతా టెస్ట్ ట్రైస్  ట్రీట్ విధానాన్ని పక్కాగా అమలు చేశాయని.. స్పెయిన్ ఇటలీ జర్మనీ భారత్ లో కరోనా లాక్ డౌన్  కు ముందు ఆ తర్వాత అని కొన్ని లెక్కలు చెప్పారు రాహుల్ గాంధీ. 

 

 

 రాహుల్ గాంధీ చెప్పిన లెక్కలు గతంలోనే చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. భారత దేశ జనాభాతో ఏమాత్రం సరిపోని దేశాలతో  రాహుల్ గాంధీ పోల్చారు అంటూ  కొంతమంది విమర్శలు సైతం చేశారు. ఇక తాజాగా చైనా కు సంబంధించి కూడా రాహుల్ గాంధీ ఒక విచిత్రమైన స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. చైనాతో డీలింగ్ భారతదేశానికి కుదరలేదు . చైనాతో వ్యవహరించేటువంటి తీరు సరిగా లేకపోతే ఎలా..? అంటు తాజాగా స్టేట్మెంట్ రాహుల్ గాంధీ ఇవ్వగా ఇది చర్చనీయాంశంగా మారింది. 

 

 

 ఇక రాహుల్ గాంధీ సోషల్ మీడియాలో ఈ పోస్టు పెట్టగానే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కౌంటర్ ఇచ్చారు. ఇండియా ని ఇటలీ గా మార్చొద్దు.. ఇప్పటికే దేశవ్యాప్తంగా మీరు మీ కుటుంబ సభ్యులు గందరగోళం సృష్టించారు అంటూ కౌంటర్ ఇచ్చారు. కరోనా  కంట్రోల్ లో ఫెయిల్ అయిన మోడీ సర్కార్ చైనా తో సంప్రదింపుల్లో  కూడా ఫెయిల్  అయింది అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై జితేంద్ర స్పందిస్తూ.. రాహుల్ గాంధీ ముతాత అయిన జవహార్ లాల్ నెహ్రూ చేసిన తప్పుల  వళ్లే  ప్రస్తుతం ఇండియా చైనా మధ్య యుద్ధ వాతావరణం నెలకొనే  పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ దేని గురించి మాట్లాడుతున్నారు ఆయనకు కూడా క్లారిటీ లేదు అని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: