పానిపూరీ.. అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరేమో. ఆ రుచి, ఆకృతి అలాంటిది మరి..చూడటానికి చిన్నగా ఉంటుంది..షట్ రుచులను కలిగి ఉంటుంది. అయితే ఉగాది పచ్చడి  పూరి అంటే ఇష్టపడని వాళ్లు ఉండరేమో..అన్నిరకాల రుచులతో పాటు ధర కూడా తక్కువ … కావున ఎవరైనా తినకుండా ఉండలేరు . వయసుతో సంబంధం లేకుండా పిల్లల దగ్గరనుంచి పెద్దల వరకు అందరు ఇష్టపడతారు,ఇక సాయంత్రం వేళలో జనాలు బారులు తీరి ఇష్టంగా తినే పానీపూరి రోగాలను కూడా తెచ్చిపెడుతుందని ఇటీవల జరిగిన గాంధీ మెడికల్ కాలేజీ నిర్వహించిన సర్వేలో తేల్చి చెప్పారు. 

 

 

పానీపూరి బండ్లు ఎక్కడబడితే అక్కడ మనకి దర్శనమిస్తాయి ..అలాంటి పానీపూరీలో కూడా ఎన్నో విషపదార్థాలు ఉన్నాయంట సుమీ..తినే ముందు మందులు మింగాలనే ఆలోచన మరవద్దని వైద్యనిపుణులు తేల్చి చెప్పారు.ఈ పానీపూరి తయారీ విధానమే కాకుండా అవి ఉండే ప్రాంతాలు కూడా ఎలా ఉన్నాయో చూసుకొని తినడం మంచిదని పేర్కొన్నారు.

 

 

ఇవి ముఖ్యంగా మురికి కాలువలకు ఎంత దూరంలో ఉన్నాయో ఫస్ట్ చూసుకోవాలి.ఒకవేళ మురికి కాల్వలకు దగ్గరలో బండ్లు ఉండటం వలన , కొన్ని రకమైన బ్యాక్టీరియాలు పానీ పూరీ పైన చేరతాయి. ఇక అవి మనం తినడం వలన ఒక్కొక్కసారి మనకి వాంతులు, విరోచనాలు అవ్వొచ్చు .అంతేకాదండోయి ఎక్కువైతే జ్వరాలు కూడా వచ్చి ప్రాణాలు పోయే ప్రమాదముందంటున్నారు.

 

 

అందుకే వాటిని తినే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి తినమని వైద్యులు హెచ్చరిస్తున్నారు..పానీపూరి తినేముందు ఆ చుట్టూ ఒక్కసారి గమనించి తినడం మేలు..ఇంకా చెప్పాలంటే మురికికి దూరంగా ఉన్న మరియు అందించేవాడి చేతులు శుభ్రంగా లేకున్నా ,శుభ్రమైన నీటిని వాడక పోవడం ,ఒకే టబ్ లోని నీళ్లతో పదే పదే అన్ని ప్లేట్లు కడుగుతున్న,పానీలో చేతులు ముంచి ఇస్తున్న ,పెట్టేటప్పుడు గ్లౌజులు ధరించక పోయిన పానీపూరి బండ్ల దగ్గరుకు వెళ్లి తినక పోవడమే మేలంటా…

 

 

ఇలా వ్యాపారం పేరుతో జనాల ఆరోగ్యానికి ముప్పు తెచ్చేవాళ్ళకి తగిన విధమైన అవగాహన జీహెచ్‌ఎంసీ, వైద్య ఆరోగ్యశాఖ వారు తెలియచేయాలని ,మురికి కాలువల పక్కన ఉన్న వాటిని తొలగించి జనాలను జబ్బుల బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకొని ,అలా వ్యాపారం చేసే ప్రబుద్దులకి తగిన గుణపాఠం చెప్పాలని నగర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: