గుంటూరు జిల్లా మంగళగిరి...టీడీపీకి అసలు పట్టు లేని నియోజకవర్గం. ఆ పార్టీ ఆవిర్భావం అంటే 1983 నుంచి 2019 ఎన్నికల వరకు జరిగిన ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ 1983, 85 ఎన్నికల్లో మాత్రమే గెలిచింది. ఇక మిగతా అన్నీ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జెండా ఎగరలేదు. అయితే 2014 ఎన్నికల్లో టీడీపీ గెలుపు అంచుల వరకు వచ్చింది. అప్పుడు వైసీపీ నుంచి పోటీ చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి కేవలం 12 ఓట్ల తేడాతో గెలిచారు.

 

అయితే అప్పుడు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చింది. మంగళగిరి ప్రాంతం రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చింది. అలాగే చంద్రబాబు మంగళగిరి మీద స్పెషల్ ఫోకస్ పెట్టి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఇక అసలు రాజకీయ అనుభవం లేకుండా, ఎమ్మెల్యేగా గెలవకుండా ఎమ్మెల్సీ అయిపోయి మంత్రి పదవి తీసుకున్న చంద్రబాబు తనయుడు నారా లోకేశ్‌ కూడా మంగళగిరిపై ఎక్కువ శ్రద్ధ తీసుకుని పనిచేశారు.

 

అక్కడకి పలు ఐటీ సంస్థలని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. అసలు అయిదేళ్లలో మంగళగిరికి ఏం కావాలో అది చేశారు. అయితే ఇంతలా మంగళగిరికి చంద్రబాబు ప్రభుత్వం చేయడానికి అసలు కారణం 2019 ఎన్నికల్లో తెలిసింది. లోకేశ్‌ని ఇక్కడ నుంచే బరిలో దింపారు. టీడీపీకి చాలా కంచుకోటలు ఉన్నాసరే, టీడీపీకి బలం లేని మంగళగిరిలో లోకేశ్ బరిలో దిగడంతో అందరూ షాక్ తిన్నారు. అయితే 2014 తర్వాత పరిస్థితులు మారడంతో లోకేశ్ గెలిచేస్తారు అనుకున్నారు.

 

కానీ ఊహించని విధంగా చినబాబుని ఆళ్ళ రామకృష్ణారెడ్డి 7 వేల మెజారిటీతో ఓడించారు. అయితే ఓడిపోయినా...సరే చినబాబు మంగళగిరిని వదిలిపెట్టకుండా, అక్కడి ప్రజలకు అందుబాటులోనే ఉంటూ, పార్టీని బలోపేతం చేస్తున్నారు. పైగా రాష్ట్ర స్థాయిలో వైసీపీ ప్రభుత్వం మీద, నియోజకవర్గ స్థాయిలో ఆళ్ళ మీద వ్యతిరేకిత పెరిగిందని, రాబోయే ఎన్నికల్లో మా చినబాబు గెలిచి, ఎమ్మెల్యే అవ్వడం ఖాయమని తెలుగు తమ్ముళ్ళు గట్టిగా చెబుతున్నారు. ఈ సారి మంగళగిరిలో పసుపు జెండా ఎగురుతుందని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని అంటున్నారు. మరి చూడాలి తమ్ముళ్ళు అన్నట్లు చినబాబు ఈసారైనా ఎమ్మెల్యే అవుతారో? లేదో?

మరింత సమాచారం తెలుసుకోండి: