ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టిస్తోంది తెలంగాణ పదవ తరగతి పరీక్షల వాయిదా విషయం. మొదట జూన్ 8వ తేదీ నుండి పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం అన్ని రకమైన ఏర్పాట్లు చేసుకుంటున్న నేపథ్యంలో కొందరు ఈ విషయాన్ని హైకోర్టు వద్దకు తీసుకుని వెళ్లారు. గత నాలుగు రోజులుగా రాష్ట్రంలో అత్యధిక మొత్తంలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండగా పరీక్షలు ఎలా నిర్వహిస్తారన్న వారి వాదనతో కోర్టు వారు ఏకీభవించడం జరిగింది. అయితే అక్కడ ధర్మాసనం తెలంగాణ వారి వాదనను పూర్తిగా కొట్టివేయలేదు కూడా.

 

దాదాపు విద్యార్థుల శ్రేయస్సు కోసమే.... వారి పక్షంలోనే వాదించిన హైకోర్టు కేవలం జిహెచ్ఎంసి పరిధిలోనికి వచ్చే స్కూళ్ళ కు చెందిన విద్యార్థులకు మాత్రమే పరీక్షలు నిర్వహించవద్దని చెప్పింది. అందుకు ప్రభుత్వం మాత్రం ససేమిరా ఒప్పుకోకపోవడం గమనార్హం. ఇంకా… హైదరాబాద్ లో పరీక్షలకు హాజరు కాలేకపోయిన వారికి సప్లిమెంటరీ లో అవకాశం కల్పిస్తామని చెప్పడమే కాకుండా వారిని రెగ్యులర్ పరిగణిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ జీహెచ్ఎంసీ మినహా మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించేందుకు అసలు తమకు ఉన్న అభ్యంతరం ఏమిటి అని కోర్టు ప్రశ్నించింది.

 

దాని వల్ల సాంకేతిక సమస్యలు వస్తాయన్న ఏజీ వాదనతో కోర్టు అంగీకరించలేదు. విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మినహా మిగిలిన చోట్ల పరీక్షలు నిర్వహించే అంశంపై ప్రభుత్వంతో చర్చించిన తర్వాత అది సాధ్యం కాదని ఏజీ కోర్టుకు తెలిపారు. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో పెట్టుకున్న కోర్టు జీహెచ్ఎంసీ మినహా మిగిలినచోట్ల పరీక్షల నిర్వహణకు అనుమతి ఇచ్చింది.

 

ఇలా అనేక వాదోపవాదాలు జరిగిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం కష్టమన్న ఉద్దేశంతో తన విపరీత ధోరణికే మొగ్గుచూపి మొత్తానికి పరీక్షలను వాయిదా వేసింది. ఇప్పటికే రెండు నెలలు తమ పరీక్షలు వాయిదా పడి ఆందోళన చెందిన విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: