తెలంగాణలో కరోనా విలయతాండవం చేస్తుంది. కరోనా కేసులే కాదు.. కొత్తగా నమోదవుతున్న మరణాలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. శనివారం ఒక్కరోజే 206 కేసులు నమోదైనట్టు ఆరోగ్యశాఖ తెలిపింది. అటు, 10 మంది కరోనాతో మరణించినట్టు తెలిపింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య 123కి చేరాయి.

 

ఇక శనివారం నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్ఎంసీ పరిధిలోనే అత్యధికంగా 152 కేసులు నమోదు అయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 10, మేడ్చల్‌లో 18, నిర్మల్‌లో 5, యాదాద్రిలో 5, మహబూబ్‌నగర్‌లో 4, జగిత్యాల, నాగర్ కర్నూల్‌లో రెండు చొప్పున, వికారాబాద్, మహబూబాబాద్‌, జనగామ, గద్వాల, నల్గొండ, భద్రాద్రి, కరీంనగర్, మంచిర్యాలలో ఒక్కొక్కటి చొప్పున కొత్త కేసులను గుర్తించారు.

 

ఇక ఇక్కడ అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటేప్రతి రోజుకి భిన్నంగా నాన్ లోకల్ కేసుల్లో శనివారం సున్నా కేసులు నమోదైనట్లు వెల్లడించారు. ఇలా కేసులన్నీ తెలంగాణ వాసులకే చెందడం నిజంగా కలవరపెట్టే విషయమే. ఇదిలా ఉండా టెస్టుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సగటున కరోనా సోకిన పేషంట్ కు సంబంధించిన 18 మంది కాంటాక్ట్ లకు మాత్రమే టెస్టులు చేస్తున్నారు. ఇదే సగటు ఏపీ లో 64 ఉండడం గమనార్హం.

 

గత 24 గంటల్లో నమోదు అయిన కేసుల్లో నాన్ లోకల్ వారివి ఇక్క కేసు కూడా లలేసు కానీ.... ఇప్పటి వరకూ ఇతర ప్రాంతాల (వలస కార్మికులు, విదేశీయులు) నుంచి వచ్చిన వారిలో మొత్తం 448 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా వీటితో మొత్తం రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 3496 కు చేరింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో చికిత్స తీసుకుంటున్న యాక్టివ్‌ కేసుల సంఖ్య 1663 గా ఉంది. ఇప్పటి వరకూ కరోనా నుంచి కోలుకున్న వారు రాష్ట్రంలో 1710 మంది.

మరింత సమాచారం తెలుసుకోండి: