జగన్ ఏడాది పరిపాలనపై సొంత పార్టీలోనే నాయకులు తీవ్రస్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేయటం ఇటీవల వైసీపీ పార్టీలో పెను దుమారాన్ని రేపటం జరిగింది. అధికారంలోకి వచ్చి ఏడాది అయినా ఎక్కడ అభివృద్ధి జరగలేదని అంతేకాకుండా ఇసుక కూడా దొరకడం లేదని చాలా దారుణంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఈ క్రమంలో విమర్శలు చేస్తున్న వైకాపా నాయకులు ఎక్కడ పాలనపై విమర్శలు చేయకుండా చాలా తెలివిగా అధికారులపై విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితి దాపురించ డానికి కారణం చూస్తే అధికారులు అసలు ప్రజాప్రతినిధులను పట్టించుకోవడం లేదట. ఇందువల్లే పార్టీలో అరమరికలు రావడానికి కారణమైనట్లు ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.

IHG

నియోజకవర్గానికి సంబంధించి చాలావరకు పనులను ప్రభుత్వం అధికారులతో చేయిం చేస్తున్నట్లు, తాము చేయాల్సిన పనులు కూడా అధికారులు చేయటంతో పార్టీలో ప్రజాప్రతినిధులకు అసహనం కలిగినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఎక్కడ ఎలాంటి సమస్య ఉంటుందో సదరు నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేకి ఒక అవగాహన ఉంటుంది. అయితే ఈ విషయంలో అధికారులు ప్రజాప్రతినిధులను పట్టించుకోకపోవడం తో పాటుగా అధ్యక్షుడు వైయస్ జగన్ కలిసే అవకాశం లేకపోవడంతో ఒక్కసారిగా ఏడాది పరిపాలనపై పార్టీలో ఉన్న నాయకులు అసంతృప్తి చెందినట్లు పార్టీలో టాక్.

IHG'unknown source': report

వైసీపీ పార్టీలో ఈవిధంగా చాలామంది అసమ్మతి నేతలు ఉంటున్నట్లు అంతర్గత రాజకీయ కారణాలు కూడా పార్టీలో అరమరికలు రావటానికి ఒక విధంగా కారణం అన్నట్లు సమాచారం. ఒక్క ఏడాదిలోనే ఈ విధంగా ఉంటే భవిష్యత్తులో ఇదే కొనసాగితే అసమ్మతి నేతలంతా ఒక గ్రూపుగా ఏర్పడి వైసిపి పార్టీని వీడే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: