రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నెలకొంటున్న నీటి వివాదం విషయంలో ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గోదావరి నీటి పై ఎలాంటి హక్కులు లేవు, దీనికి సంబంధించి గోదావరి రివర్ బోర్డు ద్వారా స్పష్టత ఇవ్వాల్సి ఉంది అని తెలిపారు. రెండు రాష్ట్రాలకు సంబంధించి నీటి పంపకాలు అంశం ఈ విషయంలో ఇటీవల గోదావరి బోర్డు సమావేశం అయింది. ఈ సందర్భంగా మంత్రి అనిల్ కుమార్ యాదవ్  మీడియాతో మాట్లాడారు. నీటి కేటాయింపులు అంశంలో తెలంగాణ తో తాము విభేదాలు కోరుకోవటం లేదని మంత్రి అన్నారు. గోదావరి తో పాటు కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన వాటానే వాడుకుంటున్నామని పోతిరెడ్డిపాడు కాలువల సామర్థ్యం పెంచే లక్ష్యం ఇదేనని వివరించారు.

 

వచ్చే ఏడాది చివరి మాసానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ఐదు సంవత్సరాల కాలంలో పోలవరం నిర్వాసితులకు ఒక ఇల్లు కూడా కట్టలేని అసమర్ధ నాయకుడు చంద్రబాబు.  అటువంటి చంద్రబాబుకి పోలవరం ప్రాజెక్టు గురించి మాట్లాడే అర్హత లేదని తెలిపారు. అయితే మరోపక్క దేశంలో నాలుగవ బెస్ట్ ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ నిలిచారని, కనీసం చంద్రబాబు పొలిటికల్ కెరియర్ లో టాప్ ఫైవ్ లో ఎప్పుడైనా నిలిచారా? అని ప్రశ్నించారు.

 

ఇలాంటి చంద్రబాబు... జగన్ పరిపాలనకు మార్పులు ఇవ్వటం హాస్యాస్పదం అని తెలిపారు.  లోకేష్ మొదటి షోకే వెనక్కి వెళ్లిపోయే ఫ్లాప్‌ సినిమా లాంటోడని ఎద్దేవా చేశారు. బీసీలను చంద్రబాబు 30 ఏళ్లు మోసం చేస్తే.. వారికి అన్ని రంగాల్లో ప్రాధాన్యత ఇచ్చిన సీఎం జగన్ అన్నారు. మొత్తంమీద చూసుకుంటే కృష్ణా జలాలలో  ఏపీ కి కావాల్సిన వాటా విషయంలో అనిల్ కుమార్ లాజికల్ గా  ఇచ్చిన సమాధానం విని చాలా మంది పోతిరెడ్డిపాడు విషయంలో ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు కరెక్టే అని వ్యాఖ్యానిస్తున్నారు. నీటి బోర్డు కేటాయింపుల ఆధారంగా వ్యహరిస్తున్నట్లు, ముందుకి వెళ్తున్నట్లు అనిల్ కుమార్ యాదవ్ క్లారిటీ ఇవ్వడం భవిష్యత్ లో రెండు రాష్ట్రాల మధ్య ఎటువంటి పొలిటికల్ వివాదాలు రాజుకోవని అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: