2019 ఎన్నికలలో గెలిచిన తర్వాత చంద్రబాబును రాజకీయంగా దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు వైయస్ జగన్. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ లోకి రావటనికి వైయస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు రావడంతో త్వరలో చంద్రబాబు కి మిగిలిన ప్రతిపక్ష హోదా కూడా పోయే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయం నడుస్తూ ఉండగానే మరోపక్క చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా చెక్ పెట్టడానికి జగన్ రెడీ అయినట్లు తాజాగా వార్తలు వినపడుతున్నాయి. పూర్తి మేటర్ లోకి వెళ్తే చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో 2014 ఎన్నికల టైంలో 14 నియోజకవర్గాల్లో 6 చోట్ల తెలుగుదేశం పార్టీ గెలవగానే గత సార్వత్రిక ఎన్నికల్లో ఒక స్థానానికి పరిమితం అయ్యింది. అది కూడా కుప్పం నియోజకవర్గానికి.

 

ఇటువంటి పరిస్థితుల్లో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్న తరుణంలో చంద్రబాబునాయుడు జిల్లాలో పార్టీ పట్టు పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో వైసిపి పార్టీ మరో రాజకీయ ఎత్తుగడ వేసింది. దీంతో సొంత జిల్లాలో కూడా చంద్రబాబుకి నూకలు చెల్లినట్లే అని ఏపీ రాజకీయాలలో వార్తలు వస్తున్నాయి. విషయంలోకి వెళితే చిత్తూరు జిల్లాలోని టీడీపీకి చెందిన ద్వితీయ శ్రేణి కేడర్ ను వైసీపీలో చేర్చుకోవాలని ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని తెలుస్తోంది.

 

జిల్లాల్లో ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యేలు లలిత కుమారి, ఏఎస్ మనోహర్ లు వైసీపీలో చేరడం ఖాయం అంటున్నారు. తంబళ్లపల్లి మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ కూడా కొంతకాలంగా టీడీపీకి దూరంగా ఉంటున్నారని సమాచారం. త్వరలోనే వైసీపీ గూటికి వస్తారని వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే చంద్రబాబు సొంత నియోజకవర్గం జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కనుమరుగైనట్లే అని రాజకీయ మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: