నిన్న హైకోర్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి టెన్త్ పరీక్షలను జిహెచ్ఎంసి పరిధిలోని విద్యార్థులకు మినహాయించి మిగతా చోట్ల అన్నింటా నిర్వహించుకోవాలని సూచించిన విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం రెండుసార్లు పరీక్షలు నిర్వహించడం కుదరదని మొత్తానికే వాయిదా వేసిన సంగతి కూడా విదితమే. అయితే నిర్ణయం సరికాదని భావించింది తెలంగాణ సర్కార్. విధంగా పరీక్షలు నిర్వహిస్తే కొందరికి అన్యాయం జరుగుతుందన్న భావనతో ఇప్పుడు ఏకంగా పదవ తరగతి వార్షిక పరీక్షల రద్దుకు తెలంగాణ సర్కార్ మొగ్గు చూపుతోంది.

 

ఇదిలా ఉండగా రేపు మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యాశాఖ మంత్రి తో విషయమై సమీక్ష నిర్వహించనున్నారు. టెన్త్ పరీక్షలను ఎలా.. ఎప్పుడు నిర్వహించాలన్న విషయంపై వారు ఒక నిర్ణయానికి వస్తారు అని తెలుస్తోంది. ఇందుకోసం కెసిఆర్ విద్యాశాఖ మంత్రి తో మరియు నిపుణులతో చర్చించి జిహెచ్ఎంసి పరిధిని మినహాయించి మిగతా చోట్ల పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందా లేదా అన్న విషయాన్ని పరిశీలించనున్నారు.

 

అలా వీలుకాని పక్షంలో కరోనా ఉధృతి ఇప్పుడే తగ్గే అవకాశాలు కనిపించనందున నేరుగా విద్యార్థులను ఇంటర్ కు ప్రమోట్ చేసే అవకాశాన్ని కూడా పరిగణించవచ్చు అని అంటున్నారు. ఇలాగే పంజాబ్ లో గ్రేడ్ ద్వారా విద్యార్థులను పదవ తరగతి పరీక్షలు లేకుండా ఇంటర్మీడియట్ ప్రమోట్ చేసిన విధానాన్ని అవలంచించే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయి.

 

అయితే గ్రేడ్లు ఇప్పటి వరకు అన్ని తరగతులలో విద్యార్థుల పర్ఫార్మెన్స్ బట్టి ఇస్తారా లేక వారి పదవతరగతి హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ మార్కులను బట్టి ఇస్తారా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. లేదా సాధారణంగా విద్యార్థులకు ఫార్మేటివ్ అసెస్మెంట్ (ప్రి ఫైనల్) పరీక్షలు ఏడాదిలో నాలుగు నిర్వహిస్తారు. వీటిలో వచ్చిన మార్కుల ఆధారంగా గ్రేడ్ లు నిర్ణయించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. ప్రస్తుత తరుణంలో ఇదే ఉత్తమ మార్గంగా ప్రభుత్వానికి కనబడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: