ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత తీసుకున్న కీలక నిర్ణయాల్లో మాన్సాన్ ట్రస్ట్ ఛైర్మన్ గా సంచయిత గజపతిరాజును నియమించడం ఒకటి. మొదట్లో సంచయిత నియామకంపై విమర్శలు వచ్చినా ఆమె రోజురోజుకూ రాటుదేలుతున్నారు. అయితే అశోక్ గజపతిరాజును అడ్డం పెట్టుకుని టీడీపీ, బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. సంచయిత కు పరిపాలనా అనుభవం లేదని.... వైసీపీ నేతలు ఆమెను అడ్డం పెట్టుకుని మాన్సాస్ భూములు కొట్టేయాలని అనుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. 
 
అయితే తనపై వస్తున్న ఆరోపణలపై సంచయిత ఒకింత ఘాటుగానే స్పందించారు. అశోక్ గజపతిరాజు ట్రస్టు భూముల పరిరక్షణ కోసం కనీసం లాయర్ ను కూడా నియమించలేదని... మాన్సాస్ క్యాంపస్ ను ఐ.ఎల్.ఎస్.ఎఫ్ కు ఇచ్చేసి విద్యార్థులను షెడ్లలోకి మార్చారంటూ కౌంటర్ ఇచ్చారు. మాన్సాస్‌ ట్రస్టు చైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు ఉన్నప్పుడు ట్రస్టు, సింహాచలం దేవస్థానం అభివృద్ధికి ఏం చేశారో ప్రజలకు బహిరంగంగా చెప్పగలరా....? అంటూ ఆమె ప్రశ్నించారు. 
 
ట్రస్టు ఆశయాన్ని బాబాయ్‌ పూర్తిగా భ్రష్టు పట్టించారని వ్యాఖ్యలు చేశారు. మోతీమహల్‌ని కూల్చివేసినప్పుడు గత చరిత్ర గుర్తుకు రాలేదా? అని వ్యాఖ్యలు చేశారు. కుట్రలు ఎక్కడ బయటపడిపోతాయో అన్న భయంతో ఇష్టం వచ్చినట్టుగా వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని అన్నారు. అశోక్ గజపతిరాజు మొదటినుంచి సౌమ్యుడిగా ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. గతంలో కేంద్రమంత్రిగా కూడా ఆయన పని చేశారు. 
           
సంచయిత వేసిన ప్రశ్నలపై అశోక్ గజపతిరాజు సమాధానం ఇవ్వాల్సి ఉంది. సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఆ ఆరోపణలు నిజమని ప్రజలు నమ్మే అవకాశం ఉంది. మాటల్లోనూ పరిణతి కనబరుస్తూ... చేతల్లోనూ రాటు దేలిన సంచయిత త్వరలో చేసిన ఆరోపణలకు సంబంధించిన వ్యవహారాలను తవ్వితీసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వివాదం ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది 

మరింత సమాచారం తెలుసుకోండి: