దేశంలో కరోనా కేసులు మరిన్ని పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకు కేసులు పెరుగుతున్నాయని లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ మద్య లాక్ డౌన్ సడలించడం.. వలస కార్మికులు తిరిగి తమ స్వస్థలాలకు చేరుకుంటున్న సమయంలో కరోనా కేసులు మళ్లీ పెరిగిపోతున్నాయని అధికారులు అంటున్నారు. ఒక్క పది హేను రోజుల్లోనే కేసులు బాగా పెరిగిపోయాయని అంటున్నారు. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఉన్న అన్నీ ప్రభుత్వ ఆసుపత్రులు, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఢిల్లీ ప్రజల కోసమే రిజర్వు చేశామని ప్రకటించారు. రోజురోజుకు పెరుగుతున్న కేసులతో కరోనా రోగులకు ఆసుపత్రులు సరిపోవడం లేదనీ.. ఈ పరిస్థితుల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతోందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.   

 


 ఈ విషయంపై సర్వే నిర్వహించామని.. 90 శాతం మంది ప్రజల అభిప్రయాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టంచేశారు. అయితే, కేంద్రానికి చెందిన ఆసుపత్రుల్లో మాత్రం అందరినీ చేర్పించుకుంటారని తెలిపారు.   మరో 15వేల పడకలు జూన్ చివరినాటికి అవసరమవుతాయని.. ప్రభుత్వం ద్వారా నియమించిన ఓ కమిటీ తెలిపిందని చెప్పారు. అయితే, అందులో ఇతర రాష్ట్రాల వారికి అవకాశం ఇస్తే.. 9వేల పడకలు మూడు రోజుల్లో నిండిపోతాయని తెలిపారు.

 

న్యూరో సర్జరీ లాంటి ప్రత్యేక శస్త్ర చికిత్రలు చేసే ఆసుపత్రులు తప్ప.. మిగిలిన ప్రైవేట్ ఆసుపత్రులు అన్ని ఢిల్లీ వారికే కేటాయించాలని కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు.   కరోనా కేసులు మొదట ఢిల్లీలో ముజాహిద్దీన్ మర్కజ్ ప్రార్థనా సమావేశాల్లో పాల్గొన్న తగ్లిబన్ ల ద్వారా పెరిగిపోయిందన్న విషయం తెలిందే. వారంతా వివిధ రాష్ట్రాలకు వెళ్లడం వారి ద్వారా ఇతరులకు కరోనా వ్యాధి ప్రబలిపోయింది.  అయితే వారందరినీ క్వారంటైన్ కి తరలించడం చేసిన విషయం తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: