టీడీపీ అధినేత చంద్రబాబు రాజకీయ వ్యూహాలు పన్నడంలో దిట్ట అనే సంగతి తెలిసిందే. అందుకే ఆయన్ని రాజకీయ అపర చాణక్యుడు అనేవారు. అయితే ఆ చాణక్యత ఈ గత కొన్నేళ్ళ నుంచి పనిచేయడం లేదు. 2004లో అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ఆయన వ్యూహాలు పెద్దగా వర్కౌట్ కావడం లేదు. కాకపోతే 2014లో మాత్రం జనం అనుభవం అనే విషయం పరిగణలోకి తీసుకోవడం వల్ల చంద్రబాబుని గెలిపించుకున్నారు. కానీ జనం నమ్మకాన్ని బాబు నిలబెట్టుకోలేదు. అందుకే 2019 ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయారు.

 

అయితే ఓడిపోయాక బాబు క్రుంగిపోకుండా పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. ఓ వైపు జగన్ ప్రభుత్వంపై పోరాటం చేస్తూనే, వ్యూహాలు వేస్తూ జగన్ ప్రభుత్వాన్ని నెగిటివ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక ఈ వ్యూహాల్లో భాగంగానే కొందరు టీడీపీ నేతలు మొదట్లో బీజేపీలోకి వెళ్లారని అర్ధమవుతుంది. ఎందుకంటే టీడీపీ ఓటమి పాలవ్వగానే చంద్రబాబుకు క్లోజ్‌గా ఉండేవాళ్లు బీజేపీలోకి వెళ్ళిపోయారు. నలుగురు రాజ్యసభ సభ్యులతో పాటు, కొందరు కీలక నేతలు బీజేపీ తీర్ధం పుచ్చుకున్నారు.

 

ఇలా వెళ్ళడం వెనుక బాబు పాత్ర ఎక్కువగానే ఉందని ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. ఇందులో బాబు బీజేపీకి దగ్గర అవ్వడం ఒక ఎత్తు అయితే, తమకు వైసీపీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని సదరు నేతలు బీజేపీలోకి వెళ్లారని క్లియర్‌గా తెలుస్తోంది. ఇదే సమయంలో నెక్స్ట్ ఎన్నికల సమయానికి టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకునేలా ఈ జంపింగ్ నేతలు కీలకంగా వ్యవహరిస్తారని తెలుస్తోంది.

 

అసలు బాబు ప్లాన్ కూడా అదే అని అర్ధమవుతుంది. అటు బీజేపీ-జనసేనలు ఎలాగో కలిసే ఉన్నాయి. 2014 ఎన్నికల్లో ఈ మూడు పార్టీలు కలిసే జగన్‌ని ఓడించారు. కానీ 2019 ఎన్నికల్లో సెపరేట్‌గా పోటీ చేయడంతో దారుణంగా ఓడిపోయారు. ఇక 2024 ఎన్నికల్లో మళ్ళీ కలిసి పోటీ చేసి జగన్‌కు పెట్టాలనే ఉద్దేశంతోనే బాబు ఈ కథ నడుపుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: