ఏపీ రాజకీయ చరిత్రలో జగన్ ప్రభంజనం సృష్టించి ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికల్లో సరికొత్త చరిత్ర సృష్టిస్తూ..175 సీట్లకు గాను 151 సీట్లు గెలుచుకుని సంచలనం సృష్టించారు.  ఇక ఇదే రివర్స్‌లో ఓటమిలో కూడా టీడీపీ చరిత్ర సృష్టించింది. టీడీపీ పార్టీ గతంలో లేని విదంగా కేవలం 23 సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇదే సమయంలో సినిమాల్లో భారీ క్రేజ్ ఉన్న పవన్ కల్యాణ్ తొలిసారి ఎన్నికల బరిలో ఘోరతిఘోరంగా ఓడిపోయారు.

 

ఆయన పోటీచేసిన రెండు చోట్ల ఓడిపోగా, జనసేన నుంచి ఒకేఒక్కరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే టీడీపీ-జనసేనలు ఇంత దారుణంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం..జగన్ గాలి. కానీ ఎంత గాలి ఉన్నా సరే వైసీపీకి 110 నుంచి 120 సీట్లు వచ్చేవి. టీడీపీ-జనసేనలు వేరువేరుగా పోటీ చేయడంతో వైసీపీకి 151 సీట్లు వచ్చేశాయి. 2014 ఎన్నికల్లో వీరు కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు.

 

కానీ తర్వాత అనూహ్య పరిణామాలతో రెండు పార్టీలు విడిపోయాయి. ఫలితంగా 2019 ఎన్నికల్లో దారుణ ఫలితాలని చవిచూడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేసి ఉంటే, కనీసం ఓ 50 నుంచి 60 సీట్లు వరకు వచ్చేవి. ఇదే విషయం రెండు పార్టీల కార్యకర్తలు పలు సందర్భాల్లో చర్చించుకున్నారు. ముఖ్యంగా కోస్తా ప్రాంతంలో జనసేన ఓట్లు చీల్చేయడం వల్ల టీడీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. కొన్నిచోట్ల మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో జనసేన అభ్యర్ధులు ఒక్కో నియోజకవర్గంలో 20 నుంచి 30 వేలు ఓట్లు తెచ్చుకున్నారు.

 

అదే రెండు పార్టీలు కలిసి బరిలో ఉంటే ఫలితాలు వేరుగా వచ్చేవి. పవన్ కల్యాణ్ కూడా రెండుచోట్ల గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో జరిగిన డ్యామేజ్‌ని బాబు-పవన్‌లు సరిదిద్దుకుంటే బెటర్ అని రెండు పార్టీలకు అనుకూలంగా ఉండే కార్యకర్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో జగన్ ప్రజల్లో మరింత అభిమానం పెంచుకుంటే, రెండు పార్టీలు కలిసిన వైసీపీని దెబ్బకొట్టడం సాధ్యమయ్యే పని కాదనే భావన కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: