తన పార్టీకి సంబంధించిన నాయకులు జంప్ అవ్వకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు చంద్రబాబు. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మాత్రం ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ కండువా కప్పుకుంటే ఉన్న ప్రతిపక్షం ఉడిపోయే అవకాశం ఉండటంతో పార్టీలో అసమ్మతి నేతలపై ప్రత్యేకమైన దృష్టి బాబు పెట్టినట్లు సమాచారం. ఈ తరుణంలో 'మహానాడు' జరుగుతున్న సమయంలోనే ఎవరైతే పార్టీ మారుతున్నట్లు పేర్లు వచ్చాయో వాళ్లతో నిత్యం చంద్రబాబు టచ్ లో ఉన్నట్లు సమాచారం. ఎప్పటికప్పుడు వారితో మంతనాలు జరుపుతూనే మరోపక్క వాళ్ల విషయంలో పార్టీ మారకుండా వాళ్ల బాధ్యతను ఇతర సీనియర్ నాయకులకు చంద్రబాబు అప్పజెప్పినట్లు టాక్.

 

ఈ విషయం నడుస్తూ ఉండగానే ఇటీవల వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సమయంలో సొంత పార్టీ నేతలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడంతో చాలా వరకు వలస రాజకీయ నేతలకు ఇటీవల బాబు మంతనాలు జరిపి బ్రేక్ వేసినట్లు వాళ్లకి భవిష్యత్తుకి సంబంధించి భరోసా ఇచ్చినట్లు టీడీపీ పార్టీలో టాక్. మరోపక్క పార్టీ మారాలనుకునే నాయకులు కూడా అధికార పార్టీ లోకి వెళ్లిన పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదని భావిస్తున్న తరుణంలో సొంత పార్టీలోనే ఉండాలని డిసైడ్ అయినట్లు టాక్.

 

ఇదిలా ఉండగా ఇలాంటిది మళ్ళీ జరగకూడదు అని ప్లాన్ చేసి వైసీపీ పార్టీలో అసమ్మతి నేతలు తో చంద్రబాబు టచ్ లో ఉన్నట్లు సరిగ్గా టీడీపీ పార్టీ నేతలు ఎవరైతే జంప్ అవ్వాలనుకుంటున్నారో...వైసీపీ పార్టీలో ఉన్న అసమ్మతి నేతలతో ప్రభుత్వంపై విమర్శలు చేయిస్తూ ఇటువైపు తన పార్టీ నేతలు జారిపోకుండా చంద్రబాబే వెనకనుండి కథ నడిపిస్తున్నట్లు మరోవైపు ఏపీ రాజకీయాల్లో వార్తలు వినబడుతున్నాయి. ఏది ఏమైనా మహానాడు ముందు వలస నాయకులకు బ్రేక్ వేయాలని చంద్రబాబు వేసిన ప్లాన్ తాజాగా వర్కవుట్ అవుతున్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: