రెండు వారాల ముందు వరకు సింగిల్ డిజిట్ లో కేసులు నమోదైన కేరళ లో పరిస్థితి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. గత కొన్ని రోజుల నుండి భారీ సంఖ్యలో కేసులు నమోదవుతుండగా  మొన్నటి నుండి ఈ సంఖ్య 100దాటింది. ఇక ఈరోజు కూడా అదే ట్రెండ్ కొనసాగింది.  ఆదివారం రాష్ట్ర వ్యాప్తంగా 107కేసులు నమోదయినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. అందులో 99 కేసులు విదేశాల నుండి వచ్చినవి కాగా 8 కాంటాక్ట్ కేసులు.. ఈకొత్త కేసుల తో కలిపి కేరళ లో ఇప్పటివరకు మొత్తం 1914కేసులు నమోదుకాగా అందులో 1095కేసులు యాక్టీవ్ గా వున్నాయి. ఇప్పటివరకు 803 బాధితులు కరోనా నుండి కోలుకోగా 15మంది మరణించారు. 
ఇక దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈరోజు కూడా భారీగా కేసులు నమోదవుతున్నాయి అందులో భాగంగా  మహారాష్ట్ర లో ఈఒక్క రోజే 3007కేసులు నమోదు కాగా  తమిళనాడు లో1515, జమ్మూ, కాశ్మీర్ లో620, హర్యానాలో  496, గుజరాత్ లో 480 ,పశ్చిమ బెంగాల్ లో 449 అత్యధికంగా కేసులు నమోదమయ్యాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 250000దాటగా 7000 కరోనా మరణాలు చోటుచేసుకున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: