కొద్ది రోజులు తెలంగాణ రాజకీయాలు బాగా వేడెక్కాయి. ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిఆర్ఎస్ ప్రభుత్వం పై దూకుడుగా ముందుకు వెళ్తుండడమే కాకుండా, ఆ పార్టీ అగ్ర నాయకుల వ్యవహారాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి వారిని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెట్టేందుకు గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిలో భాగంగానే గతంలో ఆయన టిఆర్ఎస్ మంత్రి కేటీఆర్ ప్రైవేటు ఫామ్ హౌస్ పై డ్రోన్ కెమెరా ఎగరవేసి ఆ పరిసరాలను వీడియో తీసే ప్రయత్నంలో ఉండగానే, పోలీసులు ఆయనను అరెస్టు చేయడం, ఆ తర్వాత పరిణామాల నేపథ్యంలో ఆయన జైలు జీవితం గడపడం వంటి ఎన్నో రాజకీయ పరిణామాలు జరిగాయి. ఇక ఆయన జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత రేవంత్ మరింత కసితో కేసీఆర్ ఫామ్ హౌస్ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని చూస్తున్నారు.

 


 ఎప్పటికీ ఈ వ్యవహారంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను రేవంత్ ఆశ్రయించడం, దీనిపై గ్రీన్ ట్రిబ్యునల్ కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం, దీనిపై పలువురు నిపణులతో కమిటీని నియమించింది. మరో రెండు నెలల్లో దీనికి సంబంధించిన వివరాలను కమిటీ నిగ్గు తెల్చబోతోంది. ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డి పై టీఆర్ఎస్ అంతే స్థాయిలో విమర్శలు గుప్పించింది. జీవో నంబర్ 111పరిధిలో కేటీఆర్ ఫామ్ హౌస్ లేదని, రేవంత్ రెడ్డి కే ఉందంటూ... ఆ  ఆరోపణలకు సంబంధించి వివరాలను బయటపెట్టారు. రేవంత్ ఆయన అనుచరులు, బంధువుల పేర్లపై ఉన్న భూముల వివరాలను బయటపెట్టారు. నిబంధనలకు విరుద్ధంగా రేవంత్ పెద్ద బంగళా కట్టారని, దానికి సంబంధించిన ఫోటో విడుదల చేశారు. రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు అని, టీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేశారు. 

IHG


ఈ సందర్భంగా ముందుంది మొసళ్ల పండగ అంటూ రేవంత్ రెడీ సోషల్ మీడియా లో పోస్టింగ్ పెట్టడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హీటు పెంచుతోంది. సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకు  అన్ని వివరాలను బయట పెడాతాను అంటూ రేవంత్ చెప్పడం మరింత ఆసక్తి రేపుతోంది. కేటీఆర్ కు సంబంధించి రేవంత్ బయటపెట్టే ఆధారాలను బట్టి టీలంగాణ రాజకీయాలు మరింత హీటు ఎక్కే అవకాశం కనిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: