రాజకీయాల్లో ఉన్నవారు ఎవరైనా సమయస్ఫూర్తితో వ్యవహరించాలి. ఎప్పటికప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణాలకు అనుగుణంగా తమ మాటలు ఉండేలా చూసుకోవాలి. ప్రజలకు ఏ విషయంపై ఆసక్తి ఉందో, దానిపై వెంటనే స్పందిస్తూ, తమ పార్టీ విధానం ఏంటో బయట పెట్టాలి. కానీ ఈ విషయం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పటికీ సరైన క్లారిటీతో ఉన్నట్లుగా కనిపించడం లేదు. ముఖ్యంగా ఆయన రాజకీయాలను సీరియస్ గా తీసుకోవడం లేదని విషయం కొన్ని కొన్ని సంఘటనల ద్వారా రుజువు అవుతున్నాయి. మూడు వారాల క్రితం కరోనా కారణంగా కష్టతరమైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి, చిన్నాచితకా వ్యాపారులు సైతం ఆదుకునే విధంగా ఆత్మ నిర్భర ప్యాకేజీ ప్రకటించింది కేంద్రం. దీనిపై అప్పట్లోనే అన్ని రాజకీయ పార్టీలు తమ స్పందనను తెలియజేశాయి. 

IHG


తాజాగా ఈ ప్యాకేజీ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒక ప్రెస్ నోట్ విడుదల చేసారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకు వెళ్ళాలా మధ్యతరగతి జీవితానికి మేలు చేసే విధంగా నిర్ణయాలు తీసుకుంటోంది అంటూ ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా ఎలా మేలు చేస్తుంది అనే విషయాలపై కొన్ని ఉదాహరణలను చెప్పుకొచ్చారు. 2013లో హౌసింగ్ లోన్ 10 శాతం వడ్డీ కి వచ్చేవని, ఇప్పుడు 8, 8.50 కి వస్తున్నాయంటూ పవన్ చెప్పుకొచ్చారు. అలాగే ఆత్మ నిర్భర ప్యాకేజీ ప్రకటించిన తీరుని పవన్ పొగిడారు. కరోనా కారణంగా మధ్య తరగతి జీవితాల్లో మార్పులు తీసుకొస్తాయి అని సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఇదే ప్రకటన కేంద్రం ప్రకటించిన వెంటనే పవన్ చేసి ఉంటే బాగుండేది అనే అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. దాదాపు 20 రోజుల తర్వాత అంటే మే 12వ తేదీన ప్రధాని నరేంద్రమోదీ జాతిని ఉద్దేశించి చేసిన 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించారు.

IHG

ఐదు రోజుల పాటు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రెస్ మీట్ నిర్వహించి ప్యాకేజీ లోని అంశాలను వివరించారు. ఆ ప్యాకేజీ పై వెంటనే అన్నిరాజకీయ పార్టీలు తమ స్పందన తెలియజేశాయి. ఈ  వ్యవహారం ముగిసిపోయింది అనుకుంటున్న సమయంలో, జనసేన అధినేత పవన్ ఇప్పుడు ఈ విషయంపై కాస్త ఆలస్యంగా స్పందించటం వెనుక కారణాలు ఏంటి అనేది ఎవరికీ అంతుపట్టని విధంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: