ఒక్కోసారి అదృష్టం వచ్చినట్టే వచ్చి చివరి నిమిషంలో చేజారుతూ ఉంటుంది. అప్పుడు పడే బాధ అంతా ఇంతా కాదు. అటువంటి బాధ ఇప్పుడు మాజీ మంత్రి ప్రస్తుత టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్న నాయుడికి ఎదురైంది. ప్రస్తుతం టిడిపి ఏపీ అధ్యక్ష పదవి భర్తీ చేసే విషయంపై చంద్రబాబునాయుడు సీరియస్ గా కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత అధ్యక్షుడిగా ఉన్న కిమిడి కళా వెంకట్రావు ఆ పదవిలో నియమించి ఐదు సంవత్సరాలు పూర్తి కావడంతో, ఆ స్థానంలో అదే బిసి సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని, వైసిపి  దూకుడున తట్టుకోగల సమర్ధులైన, బలమైన నాయకుడికి ఆ పదవి అప్పగించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో అచ్చెన్న నాయుడుకి ఆ పదవి ఇవ్వాలని బాబు డిసైడ్ అయ్యారు.ఇదే విషయమై పార్టీ నాయకులతో చర్చించగా వారు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. 

IHG


అచ్చెన్న నాయుడు సమర్ధత, వీరవిధేయత ను వారు శంకించకపోయినా, ఆయన దూకుడు స్వభావం పార్టీకి చేటు చేస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. గతంలో ఎన్నోసార్లు ఇదేవిధంగా దూకుడుగా వ్యవహరించి వివాదస్పదమైన సంగతిని వారు గుర్తు చేశారు. టీడీపీ కీలక నాయకులు మెజారిటీ నాయకులు వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం ఆయనకు పదవి వద్దని  సూచించడంతో బాబు కూడా ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలనే కసి, పట్టుదల ఉన్నప్పటికీ ఆయన అకారణంగా ఎక్కడైనా నోరు జారితే, పార్టీ ఇబ్బందుల్లో పడుతుందని, అప్పుడు జరగరాని నష్టం జరుగుతుందని, మొత్తంగా అది జగన్ కి కలిసొచ్చే విధంగా మారుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేయడంతో బాబు ఆలోచనలో పడ్డాడట. 

 


ప్రస్తుతం అచ్చెన్నకు టిడిపి శాసన సభ పక్ష ఉప నాయకుడు పదవి ఉంది. ఆ పదవి ఉండగానే మళ్లీ ఈ పదవిని కట్టబెట్టడం మంచిది కాదనే అభిప్రాయంతో బాబు మరో నాయకుడి కోసం వెతుకులాట మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.  అచ్చెన్న విషయంలో ప్రస్తుత అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు తెరవెనుక మంత్రాంగం చేసినట్లు తెలుస్తోంది. దివంగత ఎర్రన్నాయుడు హయాం నుంచి కళా వెంకట్రావు కు కింజరపు ఫ్యామిలీకి మధ్య విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు తమ సొంత జిల్లాలోని తమ ప్రత్యర్థి కి అధ్యక్ష పదవి ఇవ్వడం ఇష్టం లేకనే కళా వెంకట్రావు కూడా తెరవెనుక చక్రం తిప్పినట్లు, అచ్చెన్నకు అధ్యక్ష పదవి రాకుండా చేసినట్లు ఆ పార్టీలో చర్చ జరుగుతోంది. టిడిపి అధ్యక్ష పదవి వచ్చినట్టే వచ్చి ఇలా చేజారిపోవడం అచ్చెన్నకు తీవ్ర అసహనాన్ని కలిగిస్తుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: